Sunday, April 28, 2024
- Advertisement -

రెడ్ బుక్ ఎఫెక్ట్.. లోకేష్‌కు షాక్!

- Advertisement -

టీడీపీ నేత నారా లోకేష్‌కు షాక్ తగిలింది. ఇన్నర్ రింగ్ రో డ్డు కేసులో ఇప్పటికే నారా లోకేష్ పేరును చేర్చగా ఈ కేసులో సీఆర్పీపీసీ 41ఏ నోటీసుల్లో పేర్కొన్న నిబంధనలు ఉల్లంఘించారని తాజాగా నోటీసులు ఇచ్చింది సీఐడీ. చంద్రబాబుపై నమోదైన పలు కేసుల్లో సాక్ష్యులుగా ఉన్న అధికారులను రెడ్ డైరీ పేరిట బెదిరించేలా మాట్లాడరని ఆరోపిస్తూ సీఐడీ అధికారులు ఏసీబీ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

లోకేష్‌ని అరెస్ట్ చేసేందుకు అనుమవిత్వాలని కోరగా దీనిపై విచారణ చేపట్టిన ఏసీబీ కోర్టు తదుపరి విచారణను జనవరి 9కు వాయిదా వేస్తూ లోకేష్‌కు నోటీసులు ఇవ్వాలని పేర్కొంది. న్యాయస్థానం ఆదేశాలతో సీఐడీ అధికారులు లోకేష్‌కు వాట్సాప్ ద్వారా నోటీసులు పంపించగా లోకేష్ సైతం తనకు అందినట్లు తెలిపారు. నోటీసులతో పాటు పిటిషన్ వివరాలను కూడా సీఐడీ అధికారులు లోకేష్‌కు తెలిపారు.

ఇక అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏ 1గా చంద్రబాబు , ఏ2గా మాజీ మంత్రి నారాయణ , ఏ 4గా లింగమనేని రమేష్ , ఏ5గా లింగమనేని రాజశేఖర్, ఏ 14గా నారా లోకేష్ ఉన్న సంగతి తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -