Saturday, April 27, 2024
- Advertisement -

మంగళగిరిలో లోకేష్‌కు భంగపాటేనా?

- Advertisement -

నారా లోకేష్ కల ఈసారైన నెరవేరుతుందా? మంగళగిరి నుండి గెలిచి పంతం నెగ్గించుకోవాలనుకుంటున్న చినబాబు ఆ దిశగా చేస్తున్న ప్రయత్రాలు ఫలిస్తాయా? అంటే టీడీపీ వర్గాలు సైతం ఏం చెప్పలేని స్థితిలో ఉన్నాయి.పరిస్థితి అనుకూలించకపోతే చినబాబు ఓడిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెబుతున్నారు టీడీపీ నేతలు.

ఎమ్మెల్యేగా కాకముందే మంత్రిగా పనిచేసి ఆ తర్వాత తొలిసారి ఎన్నికల బరిలో నిలిచి ఓటమి పాలయ్యారు టీడీపీ ఆశాదీపం లోకేష్‌. 2019లో మంగళగిరి నుండి పోటీ చేసిన లోకేష్‌…వైసీపీ అభ్యర్ధి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత పార్టీకే పరిమితమైన లోకేష్ తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో మరోసారి మంగళగిరి నుండే తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే ఈ సారి కూడా లోకేష్‌కు భంగపాటు తప్పదని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.లోకేష్ ను ఓడించేందుకు పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తున్నామని వైసీపీ నేతలు చెబుతున్నారు.

దీనికితోడు స్థానికంగా ప్రజాబలం ఉన్న మురుగుడు లావణ్యకు సీటు కేటాయించింది వైసీపీ. బీసీ వర్గానికి చెందిన మహిళా కావడం, దీనికి తోడు మంగళగిరిలో బీసీ ఓటర్లు అధికంగా ఉంటారు. వీరంతా వైసీపీకే అండగా నిలబడతారని చెబుతున్నారు వైసీపీ నేతలు. దీనికి తోడు మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కుమార్తె కావడంతో స్థానికంగా ఆమెకు కలిసివచ్చే అంశం అని అంతా భావిస్తున్నారు. గత ఎన్నికల్లో లోకేష్‌పై వైసీపీ అభ్యర్థి 5 వేల ఓట్ల తేడాతో గెలుపొందగా ఈసారి అంతకుమించిన మెజార్టీ రావడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీనికి తోడు ఆళ్ల రామకృష్ణారెడ్డి సైతం లావణ్యకు బేషరతుగా మద్దతిస్తుండటంతో లోకేష్‌కు భంగపాటు తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -