బాహుబలి 2 సినిమా దేశంలోనే సరికొత్త రికార్డులను నమోదు చేస్తోంది. రూ. 1000 కోట్ల మార్కును దాటి సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసింది బాహుబలి 2. ప్రతి ఒక్కరి నోట ఇప్పుడు బాహుబలి గురించే చర్చ. ఇక సినిమాల సెలబ్రెటీలు కూడా బాహుబలి 2పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇక ఈ సినిమాలో హీరోగా నటించిన ప్రభాస్ నటన.. రెండు పాత్రలు అద్భుతంగా ఉన్నాయి. అయితే ఇలాంటి అద్బుతమైన కథను రాజమౌళి మొదట ప్రభాస్ కాకుండా పవన్ కళ్యాణ్ కు వినిపించాడట. అయితే.. ఆ పాత్రకు తను సరిపోనని సున్నితంగా తిరస్కరించాడట. పవర్ స్టార్ క్రేజ్ ను, హైట్ ను దృష్టిలో పెట్టుకొని.. రాజమౌళి ఈ పాత్రను పవన్ కళ్యాణ్ కు సూచించడట. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం వద్దని చెప్పాడట. మొదట భాల్లాళ దేవుడి పాత్రలో ప్రభాస్ ను అనుకున్నారట.
{loadmodule mod_custom,Side Ad 1}
అయితే బాహుబలి పాత్ర పవన్ చేయకపోవడంతో ఆ పాత్రకు ప్రభాస్ ను ఎంచుకొని.. భల్లాల దేవుడి పాత్రకు రానా ను తీసుకున్నారట. నిజానికి శివగామి పాత్రకు కూడా శ్రీదేవిని అనుకున్నారు. కానీ ప్రభాస్ కు తల్లి పాత్రలో నటించడానికి శ్రీదేవి ఒప్పుకోకపోవడంతో ఆ పాత్ర రమకృష్ణ వద్దకు చేరింది. ఇలా మొదట అనుకున్నవారు ఈ సినిమాలో చేయకపోయిన.. కథలో దమ్ము.. తీసే దర్శకుడు ఉండటంతో బాహుబలి ఇండియన్ సూపర్ సినిమాగా రికార్డు సృష్టించింది.
{loadmodule mod_sp_social,Follow Us}
Related
