Saturday, May 4, 2024
- Advertisement -

సమంత బాహుబలి-2 కి వెళ్లి.. మధ్యలోనే ఎందుకు బయటకు వచ్చిందొ తెలుసా..?

- Advertisement -
Samantha Walks Out Baahubali Middle

బాహుబలి 2 మూవీ ఎలాంటి విజయం సొంతం చేసుకుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఎక్కడ చూసిన ఇప్పుడు ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. రాజమౌళి అద్భుతంగా తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ ల నటనకు ప్రశంసలు అందుతున్నాయి.

ఇక అలాగే సమంత తన పుట్టినరోజు సందర్భంగా చిన్నారులను బాహుబలి 2 సినిమాకి తీసుకెళ్లింది. కానీ రికార్డులు, కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న బాహుబలి 2 సినిమాకు వెళ్లిన సమంత.. పట్టుమని అరగంట కూడా సినిమా చూడకుండా బయటకు వచ్చేసిందట. దాదాపు 40 మంది చిన్నారులతో హైదరాబాద్‌లోని ఓ థియేటర్లో సినిమా చూసేందుకు వెళ్లిన సమంత.. సినిమా స్టార్ట్ అయిన 20 నిమిషాల తర్వాత బయటకు వచ్చేయడానికి ఏసీనే కారణమట. థియేటర్లో ఏసీ సరిగ్గా పనిచేయకపోవడంతో ఊపిరాడక సమంత బయటికి వచ్చేసినట్లు సమాచారం.

ఇక ఆ మూవీ థియేటర్‌ యాజమాన్యంపై బాహుబలి టీమ్ అసంతృప్తి వ్యక్తం చేయగా.. థియేటర్ యజమాని సారీ చెప్పినట్లు తెలుస్తోంది. సో మొత్తానికి బాహుబలి సినిమా చూద్దాం అని వెళ్ళిన సమంతకు ఆ థియేటర్ ఊపిరాడకుండా చేసింది. ఏది ఏమైన సమంత సినిమా మొత్తం చూసిందో లేదో కానీ బాహుబలి2 పైన మాత్రం అభినందిస్తూ ట్విట్టర్లో ట్వీట్ చేస్తోంది. 

Related

  1. సమంత వల్ల.. చరణ్ సినిమాకు అలా అయింది..?
  2. బయటపడ్డ సీక్రెట్.. సమంతకు అసలు మాటలు రావట..
  3. చైతూ.. సమంత పెళ్లికి బ్రేక్.. నాగ్ కి టెన్షన్ స్టార్ట్..
  4. ఎన్టీఆర్ తో సమంతకు గొడవ.. ఎందుకు..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -