లేట్ నైట్ పార్టీ లో ఎంజాయ్ చేసిన ఎన్టీఆర్ ఫ్యామిలీ

lakshmi pranathi late night party

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తన భార్య లక్ష్మిప్రణతితో కలిసి.. నైట్ పార్టీలకు వెళ్ళారు.  ఈమధ్య కాలంలో ఎన్టీఆర్కూడా లేట్ నైట్ పార్టీ కల్చర్ కు దూరంగా ఉంటున్న క్రమంలో తారక్.. ఎక్కువ సేపు తన కొడుకు అభయ్ రామ్ తో ఆడుకుంటూ ఇంటి వద్దనే కాలం గడుపుతున్నాడు.

{loadmodule mod_custom,GA1} 

ఇలాంటి పరిస్థుతులలో జూనియర్ అతడి భార్యతో  కలిసి.. ఒక లేట్ నైట్ పార్టీకి వెళ్ళడం ఒక సంచలనం అయితే ఆ పార్టీకి సంబంధించిన ఫోటోలు.. ఇప్పుడు సోషల్ మీడియాకు లీక్ కావడంతో ఆ ఫోటోలను అత్యంత ఆసక్తిగా జూనియర్ ఫ్యాన్స్ ఒకరికొకరు షేర్ చేసుకుంటున్నారు. ప్రముఖ నిర్మాత ఎమ్ ఎల్ కుమార్ చౌదరి కూతురు కీర్తి బర్త్ డే సందర్భంగా ఈ పార్టీ జరిగింది. ఈ పార్టీకి ఎన్టీఆర్ ఫ్యామిలీతో పాటు అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి, నారా రోహిత్, ప్రగ్యా జైస్వాల్, అశ్వినీదత్ కూతురు ప్రయాంక దత్, స్వప్నదత్, రాఘవేంద్రరావు కొడుకు ప్రకాష్ కోవెలమూడితో పాటు మరికొందరు సెలెబ్రెటీలు హాజరయ్యారు. ఈ పార్టీలో జూనియర్ తో పాటు నారా రోహిత్ కూడ పాల్గొనడం జూనియర్ రోహిత్ ల మధ్య సాన్నిహిత్యాన్ని సూచిస్తోంది.

{loadmodule mod_custom,GA2}

ఈ పార్టీకి వచ్చిన వారంతా.. తెగ ఎంజాయ్ చేశారని ఈ పార్టీ విశేషాలను ఫోటోలను ప్రగ్యా జైస్వాల్ తన ట్విట్టర్ ద్వారా షేర్ చేసింది. పార్టీ కల్చర్ కు దూరంగా ఉండే జూనియర్ భార్య ఈఫోటోలలో కనిపిస్తూ ఉండటంతో నెటిజనులు అందరూ ఈ ఫోటోలను లైక్ చేస్తూ షేర్ చేస్తున్నారు. దీనినిబట్టి చూస్తూ ఉంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో పార్టీ కల్చర్ ఏవిధంగా పెరిగి పోయిందో తెలుస్తోంది.

{youtube}EW_viZN0hOI{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. డీజే ట్రైలర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన ఎన్టీఆర్
  2. ఎన్టీఆర్ కి కరెక్ట్ మొగుడు ఎవరో తెలుసా..?
  3. బుల్లితెర పై షోకి ఎన్టీఆర్ రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా..?
  4. ఎన్టీఆర్ తో బిగ్ బాస్ రియాల్టీ షో మొదటి సీజన్