Tuesday, May 21, 2024
- Advertisement -

రోగాలు వ‌స్తె అక్క‌డ చావాల్సిందే…

- Advertisement -
Salt cost in Vijaynagar at Arunachal Pradesh

ఉప్పులేని వంట‌లు ఉండ‌వు..ఉప్పుతోనే క‌లుగు చ‌ప్ప‌న్న రుచులు అన్నారు పెద్ద‌లు. నిత్యం ప్ర‌తీరోజు ప్రతీ వంట‌కంలో ఉప్పు ఉండాల్సిందే.ఉప్పు కిలో మ‌హాఉంటె రూ.20 ఉంటె ఎక్కువ‌.కాని ఆక్క‌డ మాత్రం ఉప్పుతోపాటు నిత్యావ‌స‌ర వ‌స్తువులు ద‌ర తెలిస్తే దిమ్మ‌తిరిగి మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.

భారత్, మయన్మార్‌ సరిహద్దుల్లో అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రంలో ఉన్న ఈ గ్రామం పేరు విజయ్‌నగర్‌.హిమాలయ పర్వత సానువుల మధ్య పచ్చని పచ్చిక బయళ్ల మధ్య తీర్చిదిద్దినట్లున్న ఈ గ్రామంలో కిలో ఉప్పు ధర 150 రూపాయలు, కిలో చెక్కర ధర 200 రూపాయలు.ఎనిమిది వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వెలసిన ఈ గ్రామంలో 300 రిటైర్డ్‌ సైనిక కుటుంబాలు ఉన్నాయి.

{loadmodule mod_custom,GA1}

1961లో అప్పటి అస్సాం రైఫిల్స్‌ ఇనిస్పెక్టర్‌ జనరల్, మేజరల్‌ జనరల్‌ ఏఎస్‌ గౌర్య నాయకత్వాన ‘శ్రీజిత్‌–2’ పేరిట అస్సాం రైఫిల్స్‌ నిర్వహించిన సాహస యాత్రలో ఈ గ్రామ ప్రాంతాన్ని కనుగొన్నారు. ఈ ప్రాంతం నివాసయోగ్యంగా కనిపించడంతో పదవి విరమణ చేసిన అస్సాం రైఫిల్స్‌కు ఇక్కడే వసతి కల్పించారు.ఈ గ్రామం వచ్చేందుకు ఎలాంటి రవాణా సౌకర్యాలు లేవు. అసలు రహదారులే లేవు. దట్టమైన అడవి గుండా కాలి నడకనే రావాలి. అందుకు తొమ్మిది, పది రోజులు పడుతుంది.
ఈ గ్రామంలో ప్రాథమిక పాఠశాల మినహా ఎలాంటి విద్యా, వైద్య సౌకర్యాలు లేవు. ప్రాథమిక పాఠశాలలో కూడా నెలకు ఓ విద్యార్థి వద్ద 500 రూపాయలు ఫీజు వసూలు చేస్తారు. అతి దగ్గరలో ఉన్న ఆస్పత్రికి వెళ్లాలంటే 200 కిలోమీటర్లు.1972లో భారత్‌–మయన్మార్‌ సరిహద్దులను అధికారికంగా గుర్తించక ముందే ఈ గ్రామం ఏర్పడింది. సరిహద్దుకు రక్షణగా ఉంటారనే ఉద్దేశంతోనే రిటైర్డ్‌ అస్సాం రైఫిల్స్‌ కుటుంబాలకు ఇక్కడ వసతి కల్పించారు.

{loadmodule mod_custom,GA2}

సరిహద్దులు ఖరారయినప్పుడు ఈ గ్రామస్థులందరికి అన్ని వసతులు కల్పిస్తామని, విద్యావైద్య, రవాణా సౌకర్యాలతోపాటు వ్యవసాయానికి కావాల్సినంత భూమిని కేటాయిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఒక్క ఉప్పు, చెక్కరే కాదు, ఈ గ్రామంలో పప్పు, బెల్లం నుంచి నూనెల వరకు అన్నీ ఆకాశాన్నంటే ధరలేనని 80 ఏళ్ల ఎక్స్‌ సర్వీస్‌మేన్‌ జెడ్‌ రాల్టే తెలిపారు.ప్రభుత్వమే ఏదో ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు.

{loadmodule mod_sp_social,Follow Us}

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -