ఎన్టీఆర్ తో బిగ్ బాస్ రియాల్టీ షో మొదటి సీజన్

ntr host for telugu bigg boss realty show

హిందీ ప్రేక్షకులకు.. పరిచయం ఉన్న బిగ్ బాస్ షో సౌత్ లో అంతగా పరిచయం లేదు. హిందీలో వచ్చే ఈ కార్యక్రమం.. లాంగ్వేజ్ ప్రాబ్లమ్ తో ఇక్కడ అంతగా సక్సెస్ కాలేదు. ఉత్తరాది మొత్తం కూడా బిగ్ బాస్ షో కార్యక్రమంకు అభిమానులు అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఇప్పటికే ఈ బిగ్ బాస్ షోలోని ఒక సీజన్ కు సల్మాన్ ఖాన్ హోస్టింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదాంత ఎందుకంటే.. త్వరలో తెలుగు బుల్లి తెరపై బిగ్ బాస్ రియాల్టీ షో ప్రారంభం కాబోతుంది. అది కూడా తెలుగులో. తెలుగు స్టార్ హీరో ఎన్టీఆర్ వ్యాఖ్యతగా ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. అందుతున్న సమాచారం మేరకు మాటీవీ నిర్వహించబోతున్న. బిగ్ బాస్ రియాల్టీ షోను నిర్వహించేందుకు రెడీ అవుతోంది. అందుకోసం ఎన్టీఆర్ ను వ్యాఖ్యతగా నిర్ణయించుకుంది.

{loadmodule mod_custom,Side Ad 1}

ఎన్టీఆర్ వ్యాఖ్యత అవ్వడం వల్ల బిగ్ బాస్ షోకు భారీ క్రేజ్ వచ్చే అవకాశాలున్నాయని, అందుకే కాస్త ఎక్కువ పారితోషికం అయినా కూడా మొదటి సీజన్ ను ను ఎన్టీఆర్ తో చేయించాలని నిర్ణయం తీసుకున్నారు. ఎన్టీఆర్ భారీ పారితోషికం వస్తున్న కారణంగా ఇప్పటికే ఆ కార్యక్రమం సైన్ చేసినట్లుగా తెలుస్తోంది. అతి త్వరలోనే బిగ్ బాస్ తెలుగులో మొదటి సీజన్ ప్రారంభం కాబోతుంది. మొదటి సారి ఎన్టీఆర్ బుల్లి తెరపై ఒక కార్యక్రమంకు వ్యాఖ్యతగా వ్యవహరించనున్న నేపథ్యంలో నందమూరి ఫ్యాన్స్ తో పాటు తెలుగు ప్రేక్షకులు అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

{youtube}SQgJrTusRUM{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. ‘హ్యాపీ బర్త్ డే నానా’ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ప్రేమ
  2. జ‌గ‌న్‌కి మద్దతుగా ఎన్టీఆర్ కూతురు.. అమె దెబ్బకి టీడీపీ విలవిల కొట్టుకుంది..
  3. బాహుబలి 2 ఇంటర్వెల్ సీన్ తో ఎన్టీఆర్ కి ఏం సంబంధం..?
  4. బాహుబలి 2 పై ఎన్టీఆర్ సంచలన కామెంట్స్