కృతిక హత్య మాములుగా కాదు.. కొట్టి చంపారు..?

Kruthika Chowdary Found Dead In her Apartment

బాలీవుడ్ హీరోయిన్ కృతికా చౌదరి.. మరణం ముంబైలో పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. ఈ కేసు మిస్టరీని పోలీసులు వెంటనే చేధించారు. కృతికా చౌదరిది హత్యే అని.. పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అంధేరీ ప్రాంతంలోని తన అపార్టుమెంటులో కృతిక భౌతిక కాయాన్ని సోమవారం మధ్యాహ్నం గుర్తించారు.

{loadmodule mod_custom,GA1} 

ఆమె ఉంటున్న నివాసం నుంచి నాలుగు రోజులుగా దుర్వాసన రావడంతో.. అక్కడ ఉన్నవారు పోలీసులకు పిర్యాదు చేశారు. దాంతో పోలీసులు ఇంట్లోకి వెళ్లి చూడగా.. అర్ధ నగ్నంగా విగతజీవిగా కుళ్లిన స్థితిలో ఆమె మృతదేహం పడి ఉండటం చూసి అందరూ షాక్ అయ్యారు. ఇలాంటి దారుణం చేసింది ఎవరు అని.. విచారణ జరపడంతో.. ఒక విషయం అదుపులోకి వచ్చింది. కృతిక భౌతిక కాయం అర్దనగ్నంగా పడి ఉండటంతో ఆమెపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు మొదట అనుమానించారు. పోస్టు మార్టం నివేదిక అనంతరం ఆమెపై అత్యాచారం జరుగలేదని పోలీసులు తేల్చారు.నిందితులు ఆమెను ఏ ఆయుధంతో చంపారు అనే విషయాన్ని పోలీసులు కనిపెట్టారు. పిడికిలికి ధరించే కున్ కుల్ డస్టర్ అనే ఆయుధంతో తలపై కొట్టి హత్య చేశారని పోలీసులు తెలిపారు. ఆమె ఉంటున్న నివాసం దగ్గర్లో ఉన్నవారిని విచారించడంతో పాటు.. అమె ఇంటి దగ్గర్లో ఉన్న సీసీ టీవీ పుటేజీలను  పరిశిలించిన పోలీసులు.. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

{loadmodule mod_custom,GA2} 

అయితే హత్యకు కారణం ఏమిటనే విషయాన్ని పోలీసులు ఇంకా తేల్చలేదు. అనుమానితుడిని వివిధ కోణాల్లో విచారిస్తున్నారు. ఈ నెల 5వ తేదీనే కృతిక చౌదరి పుట్టినరోజు వేడుక జరుపుకుంది. ఆమె ఇంకా ఆ ఆనందం నుండి బయట పడక ముందే ఈ దారుణం చోటు చేసుకుంది. 27 సంవత్సరాల కృతిక చౌదరి భర్తతో విడిపోయి ప్రస్తుతం ముంబైలో ఒంటరిగా ఉంటోంది. 

{youtube}YbYl77Hx4OY{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. మ‌రణాన్ని త‌ప్పించుకోవ‌డం ఎవ‌రిత‌రంకాదు… ఈసంఘ‌ట‌నే ఉదాహ‌ర‌న‌
  2. ఒక్కరు కాదు.. ముగ్గురిని పెళ్లి చేసుకున్న ఈ నటి ఎవరో తెలుసా..?
  3. అంజ‌లి భయపెట్టీన దెయ్యం.. సినిమాలో కాదు రియ‌ల్ లైఫ్‌లోనే..
  4. రాజ‌శేఖ‌ర్‌రెడ్డి గొప్పతనం.. వైఎస్ ఫ్యాన్సే కాదు.. టీడీపీ ఫ్యాన్స్ కూడా మొక్కడం ఖాయం