భారత్ .అమెరికా సంబందాల్లో మరో కొత్త అధ్యాయం మొదలు కానుంది.అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత డోనాల్డ్ ట్రంప్,ప్రధాని మోదీ భేటీపై విశేష ఆసక్తి నెలకొంది. ఆసమయం రానే వచ్చిది,ఇరువురి భేటీకి సర్వం సిద్ధమయ్యింది.ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ఈనెల 26న మోదీ, ట్రంప్ వైట్‌హౌజ్‌లో సమావేశం కానున్నారు.
ఈ సమావేశంపై సర్వత్రా అసక్తి నెలకొంది.వీరి భేటీలో ప్రధానంగా ఉగ్రవాదంతోపాటు,ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భద్రతా పరమైన చర్యలపై చర్చించనున్నారు.అలాగే హెచ్1బీ వీసా నిబంధనలు, పారిస్ పర్యావరణ ఒప్పందంపై,రక్షణరంగాలను బలోపేతం చేయడంపైనా చర్చించే అవకాశం ఉంది.
{loadmodule mod_custom,Side Ad 1}
ఉగ్రవాదంపై పోరు, ఆర్థిక అభివృద్ధి, సంస్కరణలు, ఇండో–పసిఫిక్ ప్రాంతంలో భద్రతాపరమైన చర్యల విస్తరణపై మోదీ, ట్రంప్ చర్చలు జరుపుతారు’ అని శ్వేతసౌధం మీడియా కార్యదర్శి సీన్ స్పైసర్ వెల్లడించారు.
ఈ నేపథ్యంలో మోదీ ఈనెల 25న అమెరికా బయలుదేరి వెళ్లనున్నారు. 26న ట్రంప్‌తో సమావేశమై పలు అంశాలపై చర్చిస్తారు. మరోవైపు భారత విదేశాంగ శాఖ స్పందిస్తూ.. మోదీ, ట్రంప్ సమావేశంతో ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు ఒక కొత్త దిశలో పయనిస్తాయని పేర్కొంది.
{loadmodule mod_custom,Side Ad 2}
Also read
