తెలుగు హీరోతో ఆరేళ్లు డేటింగ్ చేసిన ఇలియానా

Ileana dated a Telugu hero for 6 years

తెలుగు సినీ పరిశ్రమలోహీరో రామ్ సరసన  ‘దేవదాసు’ మూవీతో హీరోయిన్ గా పరిచయం అయింది గోవా బ్యూటీ ఇలియానా. అందమైన నడుం వొంపులతో తెలుగు హీరోల మనసును గెలిచి.. అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకొని.. నెంబర్ వన్ హీరోయిన్ స్థాయికి వచ్చింది.

ఇదే టైంలో బాలీవుడ్ లో ఆమె అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయింది. ఆ తర్వాత అక్కడా.. ఇక్కడ తెగ ప్రయత్నాలు మొదలు పెట్టినా ఈ అమ్మడిని మాత్రం ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం ఈ భామ ఆస్ట్రేలియన్‌ ఫోటోగ్రాఫర్‌ ఆండ్రూ నీబోన్‌తో లవ్ లో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరు కలిసి ఉన్న ఫోటోలో ఆ మధ్య సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేశాయి. రీసెంట్ గా ఓ ఆంగ్ల మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలైయానా మాట్లాడుతూ.. తన పాత పరిచయల గురించి.. టీనేజ్ లవ్ గురించి.. సినీ పరిశ్రమలోని కాస్టింగ్ కౌచ్ (చాన్సు లో కోసం పడకగదికి వెళ్లడం) గురించి మాట్లాడింది. ఈ భామ తెలుగు హీరోతో ఆరేళ్ల పాటు డేటింగ్ చేశానని తెలిపింది.

ఆ తర్వాత వారి మధ్య ఏవో విభేదాలు రావడంతో.. విడిపోయామని చెప్పింది. కానీ ఆ హీరో ఎవరనేది మాత్ర గోవా బ్యూటీ చెప్పలేదు. అంతే కాదు.. కాస్టింగ్‌ కౌచ్‌ అనేది హీరోయిన్ల పై ఆధారపడి ఉంటుందని నటనను నమ్ముకొన్న వారికి ఇలాంటివి అస్సలు అవసరం లేదని చెబుతుంది. సొంత ప్రతిభను నమ్ముకున్నంత వరకు ఎవరికీ దాసోహం అవ్వాల్సిన అవసరం లేదని అంటుంది. 

{youtube}DDqobsES7VM{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. ఇలియానా, సన్నీ నగ్నంగా.. మెరుపులు పుట్టిస్తున్నారు
  2. బాయ్ ఫ్రెండ్ తో తెగ ఎంజాయ్ చేస్తున్న ఇలియానా
  3. ఇలియానాను కూడా ఘోరంగా వేధించారు!
  4. ప్రతి ఐదు సెకన్లకు సెక్స్…. అసలు విషయం చెప్పిన ఇలియానా