వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. రాజకీయ వేధింపులు, అక్రమ కేసులతో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం శ్రీకాకుళం సమీపంలోని అంపోలు జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నేత డాక్టర్ సీదిరి అప్పలరాజును ఆయన ములాఖత్ ద్వారా కలవనున్నారు. కష్టకాలంలో నాయకులకు, కార్యకర్తలకు వైఎస్సార్సీపీ పూర్తి అండగా ఉంటుందనే భరోసా ఇచ్చేందుకు జగన్ ఈ పర్యటన చేపట్టారు.
ఉదయం 9:00 గంటలకు: తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు.
ఉదయం 11:00 గంటలకు: విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గాన శ్రీకాకుళానికి పయనమవుతారు.
మధ్యాహ్నం 2:00 గంటలకు శ్రీకాకుళం సమీపంలోని అంపోలు జిల్లా జైలుకు చేరుకుంటారు.
జైలులో ఉన్న మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజును పరామర్శిస్తారు.
తిరుగు ప్రయాణం: పరామర్శ అనంతరం ఆయన తిరిగి తాడేపల్లికి బయలుదేరుతారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తూ రాజకీయ వేధింపులకు గురిచేస్తోందని వైఎస్సార్సీపీ తీవ్రంగా ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును జైలులో పరామర్శించడం ద్వారా పార్టీ అగ్రనాయకత్వం ఎల్లవేళలా కేడర్‌కు అండగా ఉంటుందనే స్పష్టమైన సందేశాన్ని వైఎస్ జగన్ ఇవ్వనున్నారు.
