- Advertisement -

భార్య, కుమార్తెలను హతమార్చి టీ తాగి పరారైన తండ్రి!

- Advertisement -

రాజస్థాన్‌లోని జైపూర్‌లో అత్యంత అమానుషమైన ఘటన వెలుగు చూసింది. కన్నవారే దైవమని నమ్మి ఉంటే, ఆ కన్నతండ్రే కంటికి రెప్పలా కాపాడాల్సిన భార్యను, ముగ్గురు కూతుళ్లను పొట్టనబెట్టుకున్నాడు. అప్పుల బాధతో కంటిమీద కునుకులేకుండా గడిపిన ఆ వ్యక్తి, కుటుంబం మొత్తాన్ని కిరాతకంగా హతమార్చాడు. ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

జైపూర్‌లోని కార్ధానీ ప్రాంతంలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. రాహుల్ ఝా అనే వ్యక్తి తన భార్య గీత, ముగ్గురు కుమార్తెలు నందిని (23), రాధిక (18), మరో 14 ఏళ్ల చిన్నారితో కలిసి అదే ఇంటి మొదటి అంతస్తులో నివాసం ఉంటున్నాడు. అదే ఇళ్లలో కింద గ్రౌండ్ ఫ్లోర్‌లో రాహుల్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఉంటున్నారు. అందరూ ఒకే ఇంట్లో వేర్వేరు అంతస్తుల్లో జీవనం సాగిస్తున్నారు.

రాత్రి అందరూ గాఢ నిద్రలోకి వెళ్లిన తర్వాత రాహుల్ తన ప్లాన్ అమలు చేశాడు. ఎవరూ గమనించకుండా భార్యతో పాటు ముగ్గురు కుమార్తెలను బండరాయితో తలపై మోది అతి కిరాతకంగా చంపేశాడు. నలుగురి ప్రాణాలు పోయిన తర్వాత కూడా అతనిలో ఎలాంటి చలనం రాలేదు. ఎంతో ప్రశాంతంగా రాత్రి గడిపాడు.

ఆ తర్వాత ఉదయాన్నే యథావిధిగా బయటకు వెళ్లి పాలు తీసుకొచ్చాడు. వంటగదిలోకి వెళ్లి స్వయంగా టీ తయారు చేశాడు. ఆ టీని కింద గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న తన తండ్రి లక్ష్మీనాథ్‌కు ఇచ్చాడు. తండ్రితో కాసేపు మాట్లాడినట్లు నటించి, ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా మెల్లగా ఇల్లు విడిచి పరారయ్యాడు.

ఉదయం చాలాసేపైనా కోడలు, పిల్లలు కిందకు రాకపోవడంతో తండ్రి లక్ష్మీనాథ్‌కు అనుమానం వచ్చింది. వెంటనే పైకి వెళ్లి చూడగా.. గదిలో భార్య, కుమార్తెలు రక్తపుమడుగులో విగతజీవులుగా పడిఉన్నారు. వారిని చూసి కుటుంబీకులు తీవ్ర భయాందోళనకు గురై షాక్‌కు గురయ్యారు.

ఉదయం 10 గంటల సమయంలో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించారు. హత్యకు ఉపయోగించిన బండరాయిని స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న నిందితుడు రాహుల్ ఝా కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.

ఈ ఘోర హత్యల వెనుక ఆర్థిక సమస్యలే ప్రధాన కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. రాహుల్ తీవ్రమైన అప్పులపాలయ్యాడని పోలీసులు గుర్తించారు. సరిగ్గా మూడు రోజుల క్రితమే పొరుగింటి వారి వద్ద నుంచి రూ.25 వేలు అప్పు తీసుకున్నట్లు సమాచారం లభించింది. అప్పులు తీర్చలేక మానసిక ఒత్తిడికి గురై ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. హత్యలకు అసలు కారణాలపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -