బీఎస్‌ఈ(బాంబే స్టాక్ ఎక్చేంజ్)కు చరిత్రలో ఆగష్టు24 మరో బ్లాక్ మండేగా మిగిలిపోయింది.
బాంబే స్టాక్ ఎక్చేంజ్ ఫలితంగా ఇన్వెస్టర్లకు సంబంధించి ఒకటి రెండు కాదు ఏకంగా ఏడు లక్షల రూపాయలు ఆవిరైపోయాయి. మార్కెట్ ఈ రోజు భారీ స్థాయిలో పడిపోవడమే దీనికి కారణం. మన రూపాయి డాలర్‌తో పోల్చితే బాగా తగ్గిపోవడం, అదే సమయంలో చైనా ఆ దేశపు కరెన్సీని తగ్గించుకోవడం ఈ రెండూ ఒకేసారి జరగడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ని దెబ్బతీశాయి. దీనిపై ప్రభుత్వం సర్ధుబాటు చర్యలు చేపట్టింది. అయినా ప్రధానమైన షేర్లన్నీ కుప్పకూలిపోయాయి.
సెన్సెక్స్ 1624 పాయింట్లు పతనమై 25741 వద్ద ఆగింది. నిప్టీ 490 పాయింట్లు పడిపోయి 7809 వద్ద ముగిసింది. రియల్ ఎస్టేట్, ఇంధన, బ్యాంకింగ్, ఆటో, ఐటీ, ఇన్ ప్రాస్ట్రక్చర్, వాటాలు భారీగా నష్టపోయాయి. 2008, జనవరి 21 తర్వాత సెన్సెక్స్ భారీగా పతనమవ్వడం ఇదే తొలిసారి.
దీనిపై ఆర్‌బిఐ గవర్నర్ రఘురామ్‌రాజన్ స్పందిస్తూ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతోందని, నిర్మాణాత్మక పనులు అవసరమని సూచించారు. దీనిని సవరించుకునేందుకు మనం ప్రాజెక్టులను మరింత వేగంగా చేపట్టాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు ఢోకా లేదని భరోసా ఇచ్చారు.
