- Advertisement -

ఢిల్లీకి చేరిన గాదె సాయికృష్ణ కేసు

- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ లాకప్ డెడ్ ఆరోపణలు అలాగే క్రాంతి కుమార్ ఆత్మహత్య ఉదంతాలు దేశ రాజధాని ఢిల్లీకి చేరాయి. రాష్ట్రంలో జరిగిన ఈ రెండు తీవ్రమైన ఘటనలపై జాతీయ మానవ హక్కుల సంఘం (NHRC) తక్షణమే స్పందించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వైసీపీ ఎంపీలు డిమాండ్ చేశారు. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ లోక్‌సభ సభ్యులు డాక్టర్ గురుమూర్తి, తనుజారాణి శుక్రవారం నాడు ఢిల్లీలో జాతీయ మానవ హక్కుల సంఘం చైర్మన్ జస్టిస్ రామసుబ్రహ్మణ్యంను వ్యక్తిగతంగా కలిసి వినతిపత్రం సమర్పించారు.

ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకున్న ఈ రెండు ఘటనల వివరాలను, నివేదికలను పరిశీలించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ (NHRC) చైర్మన్ జస్టిస్ రామసుబ్రహ్మణ్యం సానుకూలంగా స్పందించారు. చట్ట ఉల్లంఘనలు, మానవ హక్కుల భంగం కలిగించే లాకప్ మరణాలు మరియు పోలీసు వేధింపుల ఉదంతాలపై కమిషన్ కఠినంగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

రాష్ట్రంలో పోలీసుల వేధింపులు, లాకప్ మరణాలపై మానవ హక్కుల కమిషన్ జోక్యం చేసుకోవాల్సిన ఆవశ్యకతను ఎంపీలు ఈ సందర్భంగా చైర్మన్‌కు వివరించారు.విజయవాడలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన గాదె సాయికృష్ణ మృతి తీవ్ర వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే.

పోలీసుల కస్టడీలోనే సాయికృష్ణ మరణించాడంటూ వస్తున్న లాకప్ డెడ్ ఆరోపణలపై ఎంపీలు గురుమూర్తి, తనుజారాణి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక పోలీసుల దర్యాప్తుపై నమ్మకం లేదని, ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘం పర్యవేక్షణలో ఒక నిష్పక్షపాత, స్వతంత్ర విచారణ జరిపించాలని జస్టిస్ రామసుబ్రహ్మణ్యంకు విజ్ఞప్తి చేశారు. బాధితుడి కుటుంబానికి న్యాయం జరగాలంటే నిజాలు బయటకు రావాలని కోరారు. అలాగే క్రాంతి కుమార్ ఆత్మహత్యకు కారణమైన సీఐ నాగరాజుపై తక్షణమే శాఖాపరమైన, చట్టపరమైన విచారణ జరిపి నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -