శంకరాభరణం సినిమా తో పాటు బెంగాల్ టైగర్ సినిమాలో ప్రముఖ పాత్ర చేసిన థర్టీ ఇయర్స్ పృధ్వీ ఇప్పుడు వార్తల్లో వ్యక్తి అయ్యాడు. దాదాపు ఇరవై ఏళ్ళకి పైగా ఇండస్ట్రీ లో నలుగుతూ వచ్చిన ఈ కమెడియన్ భలే సూపర్ హిట్ అవుతున్నాడు.
బ్రహ్మానందం ఫేడవుట్ అవుతున్న సమయంలోనే పృథ్వీ రైజ్ అవుతుండటంతో టాలీవుడ్ లో వీళ్లిద్దరి గురించి ఆసక్తికర చర్చ నడుస్తోంది.
ఇలాంటి సమయంలోనే చక్రి అనే యువ దర్శకుడితో రవితేజ చేయబోయే సినిమాలో ఓ పాత్ర కోసం ముందు బ్రహ్మిని అనుకుని.. ఆ తర్వాత పృథ్వీని తీసుకున్నారన్న వార్త హల్ చల్ చేస్తోంది. దీంతో బ్రమ్మీ పాత్రలు మీరు తన్నుకుపోతున్నారు అన్న మాట విలేఖరులు అడగగా అలాంటిదేమీ లేదు అని, ఛాన్స్ ఇచ్చిన వారికి ఎవరికి ఇవ్వాలి అని అనిపిస్తే వారికి ఇస్తారు అని చెప్పుకొచ్చాడు పృధ్వీ. ఇంకా తన కొత్త సినిమాల విశేషాలు చెబుతూ త్వరలో ఒక తమిళ సినిమా కోసం సిక్స్ ప్యాక్ కి ప్రయతిస్తున్నా అంటూ చెప్పుకొచ్చి ఆశ్చర్యపరిచాడు.
ఆయన సిక్స్ ప్యాక్ చేస్తే అసలు ఎలా ఉంటుందో ఊహించుకోవడమే కష్టం. మధ్య వయసు మనిషి అయిన పృధ్వీ చాలా దట్టంగా ఉండే మనిషి. సునీల్ లాంటి వారు హీరోలు అవడం కోసం చేసారు అంటే అర్ధం ఉంది కానీ పృధ్వీ లాంటి వారికి ఇది సాధ్యమా అనేది ఆలోచించాల్సిన విషయం.
