Friday, May 17, 2024
- Advertisement -

బాబు సొంత జిల్లాలో టిడిపికి అన్నీ ఎదురుదెబ్బలే…. అభ్యర్థులకూ దిక్కులేదా?

- Advertisement -

2019 ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే స్థాయి టిడిపి నాయకులకు గెలుపుపై నమ్మకం పోతోంది. తాజాగా గల్లా జయదేవ్‌లాంటి అత్యంత ధనవంతుడైన టిడిపి ఎంపి తల్లి, సీనియర్ నాయకురాలు గల్లా అరుణకుమారి కూడా చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి భయపడుతున్న విషయాన్ని చంద్రబాబుకు తెలియచేశారు. ఆల్రెడీ నగరి నియోజకవర్గంలో రోజాను ఢీకొట్టే నాయకుడు టిడిపిలో లేకుండా పోయాడు. రోజాను ఎలా అయినా ఓడించాలని పట్టుదలగా ఉన్న చంద్రబాబు ఆశలు 2019లో నెరవేరేలా కనిపించడం లేదు. కనీసం సరైన అభ్యర్థి కూడా దొరకని దుస్థితి చంద్రబాబుది.

ఇక ఇప్పుడు చంద్రగిరి నియోజకవర్గంలో చెవిరెడ్డి భాస్కరరెడ్డిని ఓడించడం కూడా కష్టమని టిడిపి నాయకులకు అర్థమైంది. స్థానికంగా తాజాగా గల్లా అరుణకుమారి ఒక సర్వే చేయించుకున్నారట. ఆ సర్వేలో టిడిపికి పూర్తి వ్యతిరేక ఫలితాలు రావడంతో చంద్రగిరి నియోజకవర్గ ఇన్ ఛార్జ్ బాధ్యతల నుంచి తనను తప్పించాలని చంద్రబాబుకు మొహం మీదే చెప్పేసింది గల్లా అరుణ. తన కొడుకు గల్లా జయదేవ్ ఎంపిగా ఉన్న గుంటూరు జిల్లాలో ఏదైనా నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని గల్లా అరుణకుమారి భావిస్తున్నారట. చంద్రగిరిలో మాత్రం టిడిపి గెలిచే అవకాశం లేదని…..అందుకే ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేయలేనని చంద్రబాబుకు వివరించారు గల్లా అరుణ. ఈ మొత్తం పరిణామాలు మాత్రం వైకాపా నేతలు, శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. సిఎం సొంత జిల్లాలో ఆల్రెడీ రెండు నియోజకవర్గాల్లో వైకాపా గెలిచినట్టేనని…….అది కూడా చంద్రబాబుకు కంట్లో నలుసు లాంటి రోజా, జగన్‌కి సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కరరెడ్డిలకు ఈ స్థాయిలో ప్రత్యర్థిపై అడ్వాంటేజ్ దక్కడంపై వైకాపాలో ఆనందం వ్యక్తమవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -