Saturday, April 27, 2024
- Advertisement -

పురందేశ్వరిపై బీజేపీ నాయకురాలు కాదా..స్పందించని నేతలు!

- Advertisement -

ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి అటు సొంత పార్టీ ఇటు బయట పార్టీ నుండి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక సొంత పార్టీ నేతలు ఆమెపై తిరుగుబాటు జెండా ఎగురవేస్తూ ఆమెను అధ్యక్ష పదవి నుండి తీసేయాలని డిమాండ్ చేస్తుండగా తాజాగా వైసీపీ నేతలు విజయ్ సాయిరెడ్డి, మంత్రి రోజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వెన్నుపోటును పొడవడంలో చంద్రబాబును మించిన జగత్ కిలాడీ పురందేశ్వరి అని మండిపడ్డారు. ఆ నాడు సీఎం సీటు కోసం చంద్రబాబుతో పోటీ పడింది వాస్తవం కాదా చెప్పాలన్నారు. ఇక ఇలాంటి కూతురును కన్నందుకు ఎన్టీఆర్ కుమిలి కుమిలి ఏడుస్తుంటారని ఎద్దేవా చేశారు.

ఇక పురందేశ్వరిపై ఎన్ని విమర్శలు వస్తున్నా బీజేపీ నేతలు మాత్రం స్పందించడం లేదు. ఆమె వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.అప్పుడో ఇప్పుడో టీడీపీ సానుభూతి పరులు మాత్రమే స్పందిస్తున్నారు. దీంతో అసలు ఆమె బీజేపీ నేతేనా అన్న సందేహం ఇప్పుడు అందరిలో నెలకొంది. ఎందుకంటే ఓ రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలిపై తీవ్ర విమర్శలు చేస్తే కనీసం ఆ పార్టీ అధికార ప్రతినిధులు కూడా ఖం డించడం లేదంటే త్వరలోనే పురందేశ్వరి పదవి ఉస్టింగ్ అవడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది.

అసలు ఈ గొడవంతటికి కారణం ఇసుక విక్రయాల్లో జగన్ ప్రభుత్వం భారీగా దోపిడీకి పాల్పడుతోందని పురందేశ్వరి ఆరోపించారు. కోర్టు స్టేలతో ఉన్న చంద్రబాబు సంగతి తేల్చమని సీబీఐకి పురంధేశ్వరి లేఖ రాయాలని డిమాండ్ చేశారు రోజా. అసలు పురందేశ్వరి కంటూ ఓ నియోజకవర్గం లేదు…ఓట్లు వేసే వారూ లేరు. ఎన్టీఆర్ కూతురు అని ఓ ట్రంప్ కార్డు తప్ప ఏం లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబును మించి జగత్ కిలాడీ పురందేశ్వరి అని ఆగ్రహం వ్యక్తం చేశారు రోజా. మరి దీనిపై ఆమె ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -