ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాలు అన్ని బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయ్యాయి. కాని సీనియర్ హీరో వెంకటేశ్ నటించిన ఎఫ్ 2 సినిమా మాత్రం తన సత్తాను చాటింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 12న విడుదలైంది. వెంకటేశ్‌తో పాటు యంగ్ హీరో వరుణ్ తేజ్ కూడా నటించిన ఈ సినిమా సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది.
అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు. తాజాగా ఈ సినిమా 100 కోట్ల క్లబ్లో చేరినట్లు ట్రెడ్ పండితులు చెబుతున్నారు. వెంకీ, వరుణ్ కెరీర్లలో అతి పెద్ద హిట్‌గా నిలిచింది ఈ సినిమా. పెళ్లి తరువాత భర్తలు పడే కష్టాలను ఈ సినిమాలో బాగా చూపించారు దర్శకుడు. ఈ సినిమాలో హీరోయిన్గా తమన్నా, మోహ్రీన్లు నటించారు. సినిమా ఫుల్ రన్లో 120 కోట్లు సాధించే అవకాశం ఉందని తెలుస్తోంది.
- ‘ది ప్యారడైజ్’ మూవీ ట్రైలర్.. నాని కీలక ప్రకటన!
- యుద్ధాన్ని ఆపండి.. పుతిన్‌తో ప్రధాని మోదీ
- అసాంఘిక కార్యకలాపాలు.. రంగంలోకి దిగిన ఎస్ఐ మౌనిక!
- కొబ్బరి నీళ్లలో సైనైడ్ కలిపి ఇచ్చా!
- తమిళనాడు రాజకీయాల్లో సంచలనం!
