- Advertisement -

100 కోట్ల క్ల‌బ్‌లో ‘ఎఫ్ 2’

- Advertisement -

ఈ సంక్రాంతికి వ‌చ్చిన సినిమాలు అన్ని బాక్సాఫీస్ ద‌గ్గర ఫెయిల్ అయ్యాయి. కాని సీనియ‌ర్ హీరో వెంక‌టేశ్ న‌టించిన ఎఫ్ 2 సినిమా మాత్రం త‌న స‌త్తాను చాటింది. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమా ఈ నెల 12న విడుద‌లైంది. వెంక‌టేశ్‌తో పాటు యంగ్ హీరో వ‌రుణ్ తేజ్ కూడా న‌టించిన ఈ సినిమా సంక్రాంతి విన్న‌ర్‌గా నిలిచింది.

అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు. తాజాగా ఈ సినిమా 100 కోట్ల క్ల‌బ్‌లో చేరిన‌ట్లు ట్రెడ్ పండితులు చెబుతున్నారు. వెంకీ, వరుణ్ కెరీర్‌ల‌లో అతి పెద్ద హిట్‌గా నిలిచింది ఈ సినిమా. పెళ్లి త‌రువాత భ‌ర్త‌లు ప‌డే క‌ష్టాల‌ను ఈ సినిమాలో బాగా చూపించారు ద‌ర్శ‌కుడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా త‌మ‌న్నా, మోహ్రీన్‌లు న‌టించారు. సినిమా ఫుల్ ర‌న్‌లో 120 కోట్లు సాధించే అవ‌కాశం ఉందని తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -