- Advertisement -

జ‌మ్మూ , కాశ్మీర్‌లో మ‌రో బాంబు పేలుడు..18 మందికి తీవ్ర గాయాలు

- Advertisement -

పుల్వామా ఆత్మాహుతి దాడి జరిగిన 20 రోజులు దాట‌క‌ముందే జ‌మ్మూ, కాశ్మీర్‌లో మ‌రో బాంబు పేలుడు సంభ‌వించింది. ఈసారి సాధారణ పౌరులే లక్ష్యంగా ఉగ్ర‌వాదులు బాంబు దాడికి పాల్పడ్డారు. జమ్మూ బస్టాండ్ సమీపంలోని ఓబస్సులో బాంబు పేలుడు సంభ‌వించింది. అయితే బస్టాండ్‌లో రద్దీ తక్కువగా ఉండటంతో పెను ప్రమాదం తప్పినట్టు తెలుస్తోంది. ఈ ఘ‌ట‌న‌లో పద్దెనిమిది గాయపడ్డారు. బస్సులోనే బాంబు పేలినట్టు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. గాయ‌ప‌డిన వారిని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. బాంబు పేలుడు గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఆ ప్రాంతాన్ని త‌మ అదుపులోకి తీసుకున్నారు పోలీసులు, భద్రతా దళాలు. ఇది ఉగ్రవాదుల దుశ్చర్యా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో అధికారులు విచారణ చేపడుతున్నారు.ఇది ఉగ్రవాదుల దుశ్చర్యా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో అధికారులు విచారణ చేపడుతున్నారు. భారత్, పాకిస్థాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో… కాశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో ఉగ్రవాదులు మరోసారి దాడులకు తెగబడే అవకాశం ఉందని భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -