- Advertisement -

జమ్ముకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం…11 మంది మృతి

- Advertisement -

జమ్ముకశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్ర‌మాదంలో 11 మంది మృతిచెంద‌గా న‌లుగురు గాయ‌ప‌డ్డారు. 15 మంది ప్రయాణికులతో చందర్ కోట్ నుంచి రాజ్‌గఢ్ వెళుతున్న ఓ ఎస్‌యూవీ కుందా నల్లా ప్రాంతంలో మూలమలుపు వద్దకు రాగానే అదుపు తప్పింది. డ్రైవ‌ర్ నియంత్ర‌ణ కోల్పోవ‌డంతోనే వాహనం ఒక్కసారిగా రోడ్డుపై నుంచి పక్కనే ఉన్న 500 అడుగుల లోయలో పడిపోయింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చి సహాయకచర్యలు చేపట్టారు. ఆరుగురు ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోగా.. మరో ఐదుగురు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందారు. డ్రైవర్‌ సహా నలుగురు తీవ్రంగా గాయపడగా చికిత్స నిమిత్తం వారిని జమ్ముకు తరలించారు. సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకున్నందునే ప్రమాదం జరిగిందని అధికారులు భావిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -