జమ్ముకాశ్మీర్ మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. పుల్వామా జిల్లా లస్సిపోరా వద్ద భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. భద్రత బలగాలు , ఉగ్రవాదులకు జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ముష్కరులు ఆ ప్రాంతంలో ఉన్నారన్న పక్కా సమాచారంతో భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. ఈ క్రమంలో బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అప్రమత్తమైన బలగాలు.. ఉగ్రవాదులపై భీకరమైన కాల్పులు జరిపి నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు జవాన్లు కూడా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. గాయపడిన జవాన్లను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చనిపోయిన నలుగురు ఉగ్రవాదులు లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కాల్పులు జరిగిన ప్రాంతంనుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు జవాన్లు.
- Advertisement -
జమ్మూ, కాశ్మీర్‌లో ఎన్ కౌంటర్…నలుగురు ఉగ్రవాదులు హతం
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -
