- Advertisement -

టీడీపీ ప్ర‌భుత్వానికి మ‌రో బిగ్ షాక్‌…సీఎస్‌ను బ‌దిలీ చేసిన ఎన్నిక‌ల సంఘం

- Advertisement -

ఎన్నిక‌ల స‌మ‌యంలో టీడీపీ ప్ర‌భుత్వానికి మ‌రో భారీ బిగ్ షాక్ త‌గిలింది. ఇప్ప‌టికే ఐబీ చీఫ్‌ను , ఇద్ద‌రు ఎస్పీల‌ను ఎన్నిక‌ల విధుల‌నుంచి తొల‌గించిన ఈసీ ఇప్పుడు సీఎస్‌ను కూడా బ‌దిలీ చేసింది. ఈమేరకు కొద్ది సేపటి కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. అనిల్‌ చంద్ర పునేఠాను ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని అందులో పేర్కొంది.

ఐబీ చీఫ్ వెంక‌టేశ్వ‌ర‌రావును ఎన్నిక‌ల విధుల‌నుంచి తొల‌గించిన ఈసీ ఆదేశాల‌ను సీఎస్ పునేఠా దిక్క‌రించ‌డంతో ఈసీ ఈ నిర్ణ‌యం తీసుకుంది. ఆయ‌న స్థానంలో ఎల్వీ సుబ్ర‌హ్మ‌ణ్యంను సీఎస్‌గా నియ‌మించింది. ఎన్నిక‌లు పూర్తి అయ్యేంత వ‌ర‌కు ఏపీ సీఎస్‌గా కొన‌సాగ‌నున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -