అభిమానులతో పాటు సినీ పరిశ్రమ కూడా ఎంతగానో చిరు 150వ సినిమా కోసం ఎదురు చూస్తోంది. అయితే తమిళంలో సూపర్ హిట్ అయిన కత్తి చిత్రాన్ని తెలుగులో చిరు రిమేక్ చేస్తున్నారు. వినాయక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా రామ్ చరణ్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి కత్తిలాంటోడు అని టైటిల్ పెట్టారు అనే వార్తలు బాగానే వచ్చాయి.
అయితే ఇటివలే ఈ చిత్రంకు ఇంకా టైటిల్ పెట్టలేదు అని త్వరలోనే టైటిల్ ప్రకటిస్తాం అని రామ్ చరణ్ చెప్పాడు. తాజాగా వినబడుతున్న కథనం ప్రకారం చిరు సినిమా టైటిల్ ఏంటో తెలుసా… ”ఖైదీ నంబర్ 150”. అవును ఈ చిత్ర కథ ప్రకారం జైల్లో ఖైదీ నంబర్ 150 పేరుతో శిక్ష అనుభవిస్తుంటాడు.
దాని తాలూకు ఫోటోలు కూడా ఇటివలే మనం సోషల్ మీడియాలో చూసిన విషయం తెలిసిందే. పైగా అప్పట్లో ”ఖైదీ నంబర్ 786” టైటిల్ తో ఓ సినిమా చేసి బ్లాక్ బస్టర్ ని అందుకున్నాడు చిరు. ఆ సెంటిమెంట్ తో కూడా ఖైదీ నంబర్ 150 ” టైటిల్ పట్ల మొగ్గు చుపుతున్నారట ! అయితే ఈ టైటిల్ ఇంక అధికారికంగా ప్రకటించలేదు. త్వరలోనే ఈ టైటిల్ మీద ఓ క్లారిటీ రానుంది.
Related
