Sunday, May 19, 2024
- Advertisement -

చిరు సినిమా షూటింగ్ ఆగిందా?

- Advertisement -

చిరు 150వ సినిమా కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇటివలే ఈ చిత్రం సెట్స్ మీద కూడా వెళ్ళింది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి మొదట షెడ్యుల్ ముగిసిందని రెండో షెడ్యుల్ కూడా మొదలు అవుతోంది అని వార్తలు వచ్చాయి. అయితే మొదటి షెడ్యుల్ కాంప్లీట్ కాలేదట. మధ్యలోనే ఆపేశారనే గుస గుసలు వినిపిస్తున్నాయి.

ఫస్ట్ షెడ్యుల్ లో చిరు, ఆలీపై షూట్ చేసిన సీన్స్ సరిగ్గా రాలేదట. వాటిని మరింత బాగా వచ్చేలా స్క్రిప్ట్ లో మార్పులు చేయమని వినాయక్ కి చిరు చెప్పాడట. దాంతో వినాయక్ అండ్ టీం మరోసారి స్క్రిప్ట్ పనుల్లో బిజీ అయిపోయినట్లు ఫిల్మ్ నగర్ టాక్ వినిపిస్తుంది. మరోవైపు, పరుచూరి బ్రదర్స్, సాయి మాధవ్ బుర్రా కూడా స్క్రీన్ ప్లే గ్రాఫ్ ని తిరిగి విశ్లేషించుకునే పనిలో నిమగ్నమైయ్యారు.

ఈ మార్పులతో చిరు సరే అంటేనే షూట్ స్టార్ట్ అవుతుందని లేకపోతే కొంత టైం పట్టేలా ఉందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ వార్తలపై ఎంత నిజం ఉన్నదో తెలియాలంటే, అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.

Related

  1. పూరిని మళ్లీ లైన్‍లో పెట్టిన చిరు!
  2. చిరు సినిమాలో విజయశాంతి
  3. చిరు పై బాహుబలి భారం
  4. చిరు సందీప్ ని ఎందుకు తిట్టాడు?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -