Sunday, May 12, 2024
- Advertisement -

కబాలి ఇంట్రడక్షన్ సీన్ లీక్ అయ్యింది!

- Advertisement -

‘కబాలి’ గ్రాండ్ గా రేపే రిలీజ్ కాబోతుంది. అన్ని చోట్లా కబాలిపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఇంట్రడక్షన్ సీన్ లీక్ అయ్యింది. ఈ చిత్రంలోని రెండు నిముషాల రజనీ ఇంట్రడక్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. లీక్ అయిన సీన్లో అరబిక్ సబ్ టైటిల్స్ ఉండటంతో ఈ సీన్ గల్ఫ్ దేశాల్లో లీక్ అయ్యిందన్న అనుమానం వ్యక్తం అవుతోంది.

ఇక ఈ సీన్ లో ఏముందంటే.. ముందుగా రజనీ..జైల్లో ఒక పుస్తకం చదువుతూండగా సినిమా స్టార్ట్ అవుతోంది. ఆ తర్వాత శిక్ష పూర్తి అయ్యిందని జైలు అధికారి చేప్పడంతో రజనీ బయటకు వస్తాడు. బ్లూ డ్రస్ ధరించిన రజనీ జైలు బుక్ లో సంతకం పెడతాడు. అక్కడ నుంచి తన వస్తువులు తీసుకుని తానే షూ క్లీన్ చేసుకుని, వాచి, కోటు ధరించి అంతే స్టైల్ గా బయిటకు వస్తాడు.

జైల్లో కూడా చాలా రిచ్ నెస్ కనిపించింది. ఏది ఏమైన రజనీ సినిమాని థియేటర్స్ లోనే చూస్తాం అంటున్నారు రజనీ అభిమానులు. ఎందుకంటే థియేటర్స్ లోనే చూస్తే ఆ కిక్ వేరే ఉంటుందని చిత్ర యూనిట్ అంటుంది. ఇక ఈ చిత్రంలో రజనీ సరసన రాధిక ఆప్టే హీరోయిన్ గా నటిస్తుండగా రంజీత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం ఎలాంటి విజయం అందుకుంటుందో తెలియాలి అంటే రేపటి వరకు ఆగాల్సిందే.

Related

  1. రేపు మధ్యానం కబాలి సంగతి తేలిపోతుంది
  2. బ్రేకింగ్ : లీక్ అయిపోయిన కబాలి సినిమా – ఆన్ లైన్ లో వచ్చేసింది
  3. అందరికంటే ముందే కబాలి సినిమాని చూసింది ఎవరో తెలుసా?
  4. రెండు గంటల్లో కబాలి టికెట్ లు ఓవర్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -