గర్ల్ ఫ్రెండ్ అంటే ఈ హీరోయిన్‌లా ఉండాలి!

నయనతార తన అందాలతో దశాబ్ద కాలంగా కుర్రకారుని పిచ్చేకేస్తోంది. ప్రస్తుతం నయనతార చేసిన సినిమాలు అన్ని సూపర్ హిట్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ హీరోయిన్ ఏ హీరోయిన్ తీసుకోని రెమ్యునరేషన్ తీసుకుంటోంది. మాయ, నేనూ రౌడీనే, డోరా, కాష్మోరా వంటి వినూత్నమైన చిత్రాల్లో నటిస్తున్న ఈ భామ ఈ వారం విడుదలైన విక్రమ్‌ ఇరు ముగన్‌ లో నటించి మెప్పించింది.

అసలు విషయంలోకి వెళ్తే… నయనతార ఇప్పటికే రెండుసార్లు ప్రేమలో విఫలమైన విషయం తెలిసిందే. అయితే ఆ రెండుసార్లు నయనతారే ఎన్నో త్యాగాలు చేసి, విమర్శలపాలయ్యింది. శింబుతో లవ్ లో ఉన్నప్పుడు నయనతార చాలా నష్టపోయిందట. అయిన అందరూ నయన్‌నే విమర్శించారు. ఆ తర్వాత ప్రభుదేవ కోసం నయనతార ఎన్ని త్యాగాలు చేసిందో తెలిసిందే. క్రిస్టియానిటీ నుంచి హిందూ మతంలోకి మారింది.

అయిన కూడా ఆ లవ్ విఫలమైంది. అయితే ప్రస్తుత లవర్‌ డైరెక్టర్‌ విఘ్నేష్‌ కోసం కూడా నయన్‌ ఎన్నో త్యాగాలు చేస్తోందట. ఆయనకు పెద్ద హీరోలతో చాన్సులు ఇప్పిస్తోందట. పెద్ద హీరోలను బతిమాలుకుని విఘ్నేష్‌ కథ వినమని అడుగుతోందట. ఎట్టకేలకు తమిళ టాప్‌ హీరో సూర్య నయన్‌ విజ్ఞప్తిని మన్నించాడు. విఘ్నేష్‌ దర్శకత్వంలో నటించేందుకు అంగీకరించాడు. నిజంగా టాప్‌ హీరోయిన్‌ రేంజులో ఉన్న నయనతార తన ప్రేమికుడి కోసం ఇంతలా తపనపడడం నిజంగా గ్రేట్ అంటున్నారు సినీజనాలు.

Related

  1. నయనతార పని అయిపోయింది!
  2. నయనతారకు ముద్దు ఇచ్చి షాక్ చేశాడు!
  3. నయనతార కొంప ముంచిన హీరో!
  4. నయనతార రేటు ఎంతంటే?