Tuesday, May 14, 2024
- Advertisement -

ఇప్పటివరకు 100 కోట్లు సాధించిన చిత్రాలు ఇవే!

- Advertisement -

సౌత్ లో ఇప్పటి వరకు 23 చిత్రాలు మాత్రమే.. 100 కోట్లు సాధించాయి. ఇక ఇందులో తెలుగు సినిమాల విషయంకి వస్తే.. 9 సినిమాలు ఈ ఫీట్ సాధించాయి. రీసెంట్‌గా రిలీజ్ అయిన జనతా గ్యారేజ్ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. జనతా గ్యారేజ్ 8 రోజుల్లోనే రూ. 100 కోట్ల గ్రాస్ సాధించిన సంచలనం సృష్టించింది.

ఈ 23 సినిమాల లిస్టులో జనతా గ్యారేజ్ 18వ స్థానం దక్కించుకుంది. బాహుబలి నెం.1 స్థానం లో ఉండగా.. టాప్ 5లో మిగిలిన 4 సినిమాలు రజనీకాంత్, శంకర్ సినిమాలే ఉండటం గమనార్హం. ఇప్పటి వరకు రూ. 100 కోట్ల వసూళ్లను సాధించిన సినిమాలపై ఓ లుక్కేద్దాం….

*రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన ‘బాహుబలి’ రూ. 600 కోట్ల గ్రాస్ సాధించింది. ఈచిత్రం తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లింది. త్వరలోపార్ట్ 2 కూడా రాబోతోంది. 

* రజనీకాంత్ కబాలి చిత్రం పెద్దగా హిట్ కాకపోయిన రజనీకాంత్ కు క్రేజ్ వల్ల ఈ ఈ సినిమా 300 కోట్ల గ్రాస్ వసూలు చేసి రెండో స్థానంలో ఉంది.

* రజనీకాంత్, శంకర్ కాంబినేషన్లో వచ్చిన రోబో రూ. 289 కోట్లు వసూలు చేసింది.

* విక్రమ్, శంకర్ కాంబినేషన్లో వచ్చిన ‘ఐ’ సినిమా బాక్సాఫీసు వద్ద రూ. 239 కోట్లు వసూలు చేసింది.

* రజనీకాంత్, శంకర్ కాంబినేషన్లో వచ్చిన మరో భారీ చిత్రం శివాజీ. ఈ చిత్రం 155 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

* రజనీకాంత్ నటించిన లింగా ప్లాప్ అయిన బాక్సాపీసు వద్ద రూ. 154 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. 

* రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వచ్చిన చిత్రం మగధీర. ఈ చిత్రం బాక్సాపీసు వద్ద రూ. 150 కట్ల గ్రాస్ వసూలు చేసింది.

* మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన శ్రీమంతుడు. ఈచిత్రం బాక్సాఫీసు వద్ద రూ. 144.5 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

* తమిళంలో విజయ్ నటించిన తేరి చిత్రం తమిళంలో రూ. 143 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

* పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అత్తారింటికి దారేది చిత్రం బాక్సాఫీసు వద్ద రూ. 131 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

* అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ ఎంటర్టెనర్ ‘సరైనోడు’ మూవీ బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు సాధించింది. ఈ చిత్రం మొత్తం రూ. 127.6 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

* అజిత్ హీరోగా తమిళంలో తెరకెక్కిన వేదాలం కోట్ల గ్రాస్ వసూలు చేసింది. 

* తమిళ స్టార్ విజయ్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘తుపాకి’ రూ. 125 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

* విజయ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘కత్తి’ తమిళంలో రూ. 125 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

* సూర్య హీరోగా తెరకెక్కుతున్న సింగం 2 మూవీ రూ. 122 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

* రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంలో ఆయనే హీరోగా నటించిన చిత్రం కాంచన 2 కామెడీ హారర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి వసూల్లు సాధించింది. ఈ చిత్రం రూ.113 కట్ల గ్రాస్ వసూలు చేసింది.

* మల్ హాసన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన విశ్వరూపం మూవీ కూడా మంచి సక్సెస్ సాధించింది. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద రూ. 108 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అప్పట్లో ఈ చిత్రం పలు వివాదాలకు కారణమైంది.

* పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన కమర్షియల్ ఎంటర్టెనర్ ‘గబ్బర్ సింగ్’ బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద రూ. 104 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

* జూ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన ‘జనతా గ్యారేజ్’ తొలి 8 రోజుల్లోనే రూ. 102 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ సినిమా వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది.

Related

  1. చిరు దెబ్బకి షాక్ అయిన రాజమౌళి!
  2. ఫ్యాన్స్ కు భయపడే రజనీకాంత్ ఆ సినిమా చేయలేదా..!
  3. మహేష్ సినిమా అర్దాంతరంగా ఆగిపోయింది!
  4. మహేష్ ని ఆకాశానికెత్తేసిన మురుగదాస్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -