Wednesday, May 1, 2024
- Advertisement -

దుమ్మురేపుతున్న ‘టక్ జగదీష్’ టీజర్..!

- Advertisement -

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘టక్ జగదీష్’.నాని ఒక వైపున ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమా షూటింగులో పాల్గొంటూనే, మరో వైపున ‘అంటే .. సుందరానికీ!’ సినిమా షూటింగును కూడా కానిచ్చేస్తున్నాడు. ఈ ఏడాది ఓటీటీలో ‘వి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం అందుకున్నాడు. ఈ రెండు సినిమాల షూటింగును చాలా తక్కువమంది సిబ్బందితో కానిస్తున్నారు. మరోవైపు టక్ జగదీష్ చిత్రం పూర్తయ్యింది. ‘నిన్నుకొరి’ తరువాత శివ నిర్వాణ, నాని కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి అంచనాలు భారీగానే ఉన్నాయి.

ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్ పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది ఈ సినిమాను నిర్మించారు. ‘టక్ జగదీష్’కు థమన్ సంగీతం అందించారు. ఏప్రిల్ 23న రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడింది. సినిమా కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు మేకర్స్. ‘టక్ జగదీష్’ చిత్రంలో నాని సరసన రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

జగపతిబాబు, ఐశ్వర్యా రాజేశ్, నాజర్, రోహిణి, దేవదర్శిని, నరేశ్, రావు రమేశ్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం నుంచి విడుదలైన సాంగ్స్, టీజర్ యూట్యూబ్ లో రికార్డు స్థాయి వ్యూస్ ను సాధిస్తున్నాయి. తాజాగా ‘టక్ జగదీష్’ టీజర్ 16 మిలియన్ల వ్యూస్ ను దాటేసి… మరిన్ని వ్యూస్ ను రాబట్టే దిశగా దూసుకెళ్తోంది.

సుమ తర్వాత నేనే.. వాళ్ళలా తప్పులు చేయనంటున్న యాంకర్!

ఆ హీరోయిన్ నిర్ణయం కారణంగా ప్యాకప్ చెప్పిన నాని..!

కరోనాతో కోలీవుడ్ దర్శకుడి కన్నుమూత!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -