Saturday, April 20, 2024
- Advertisement -

సుమ తర్వాత నేనే.. వాళ్ళలా తప్పులు చేయనంటున్న యాంకర్!

- Advertisement -

తెలుగు బుల్లితెరపై వివిధ కార్యక్రమాలలో సందడి చేస్తూ, సినిమా ఈవెంట్లలో, ఫ్రీ రిలీజ్ వేడుకలలో మనకు ఎక్కువగా దర్శనమిచ్చే యాంకర్ ఎవరంటే అందరికీ వెంటనే సుమ గుర్తొస్తారు. యాంకరింగ్ చేసే విషయంలో సుమ తర్వాతే ఎవరైనా అని చెప్పవచ్చు. సుమ నిజానికి తెలుగమ్మాయి కాకపోయినా అచ్చ తెలుగులో ఎంతో అద్భుతంగా మాట్లాడుతుంటారు. సుమమాత్రమే కాకుండా యాంకర్లుగా రష్మీ, అనసూయ, శ్రీముఖి వంటి వారికి ఫుల్ క్రేజ్ ఉన్నప్పటికీ వీరందరూ కేవలం బుల్లితెర కార్యక్రమాలకు మాత్రమే పరిమితమై ఉంటారు.

సినిమా వేడుకలు ఈవెంట్లను డీల్ చేసే కెపాసిటీ ఉన్న యాంకర్లలో సుమ తరువాత శ్యామల అని చెప్పవచ్చు. యాంకర్ శ్యామల కూడా అచ్చ తెలుగులో మాట్లాడుతూ ఎంతో మందిని ఆకట్టుకుంటుంది. ఎంతైనా సుమ మన కాకినాడ అమ్మాయి కదా. తెలుగులో మాట్లాడటమే కాకుండా పద్ధతులను కూడా ఎంతో చక్కగా పాటిస్తుంటారు.

ఈ సందర్భంగా యాంకర్ సుమతో పోలుస్తూ సుమ తర్వాత మీరే అంటూ ఎంతో మంది ఫ్యాన్స్ అనడంతో ఈమె తెగ సంబరపడిపోతూ ఉంటారు. అందరూ సుమ తర్వాత మీరే అని అనడంతో ఎంతో సంతోషంగా అనిపిస్తుంది అంటూ తెలిపారు.ఏదైనా ఈవెంట్లకు వెళ్లినప్పుడు మహిళలు మాత్రమే కాకుండా అబ్బాయిలు కూడా అక్క అంటూ ఎంతో ఆప్యాయంగా రిసీవ్ చేసుకుంటారని తెలిపింది.

ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఎలాంటి బాడ్ కామెంట్స్ తన వరకు రాలేదు. ఎందుకంటే నేను అందరిలాగా తొందరగా విజయం సాధించాలని తప్పులు చేయను కాబట్టి నాకు బ్యాడ్ కామెంట్స్ ఎవరూ చేయలేదంటూ శ్యామల తెలిపారు.

అలాంటివాటి జోలికి ఇక పోనంటున్న యాంకర్ రష్మీ.. కారణం?

పోలవరం ప్రాజెక్ట్ పై టీడీపీ తీరు ఇలా…!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -