Saturday, April 20, 2024
- Advertisement -

ఆ హీరో రూ.3లక్షల జీతం కాదని సినిమాల్లోకి వచ్చాడట..!

- Advertisement -

30 వెడ్స్ 21… ఇప్పుడు యూట్యూబ్లో మారుమోగుతున్న పేరు ఇది. ఇప్పటికే యూట్యూబ్లో 6 ఎపిసోడ్ లు విడుదల అయ్యాయి. ఏడో ఎపిసోడ్ కోసం నెటిజన్లు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అందుకు కారణం ఆ వెబ్ సిరీస్ జనానికి విపరీతంగా నచ్చేయడమే. 30 ఏళ్ల యువకుడు 21 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, వాళ్లిద్దరి మధ్య జరిగే కథే ఈ వెబ్ సీరిస్. ఇందులో 30 ఏళ్ల బ్యాచిలర్ పృథ్వీగా గా చైతన్య రావు అద్భుతంగా నటిస్తున్నాడు. అమాయకపు భర్త గా సహజంగా నటిస్తున్నాడనే పేరు తెచ్చుకున్నాడు. ఆయన కామెడీ టైమింగ్ కూడా అద్భుతంగా ఉంది.

తాజాగా ఆయన మీడియాతో మాట్లాడాడు. ‘ నాకు సినిమాలంటే పిచ్చి. అందుకే మూడు లక్షలు ఉద్యోగాన్ని వదులుకొని మరీ సినిమాల్లోకి వచ్చా. నాకు చిన్నప్పటి నుంచి సినిమాల్లోకి వెళ్లాలని ఆశ ఉన్నా అమ్మ,నాన్న మాట కాదనలేక ఆస్ట్రేలియాకు వెళ్లి ఎంబీఏ పూర్తి చేశా. అక్కడే ఉద్యోగంలో కూడా చేరా. నెలకు మూడు లక్షలు జీతం వస్తున్నా ఎందుకో సంతృప్తి అనిపించలేదు. ఎలాగైనా సినిమాల్లో నటించాలని ఆశతో ఉద్యోగాన్ని వదిలేసి హైదరాబాద్ కు వచ్చేసా. జాబ్ మానేసి నందుకు ఇంట్లో వాళ్ళు తిడుతున్నా సినిమాల్లో అవకాశం కోసం గట్టిగానే ప్రయత్నాలు చేశా.

Also Read: రెబల్ స్టార్ సినిమాలో రాశి ఖన్నాకు ఛాన్స్..!

2016లో బందూక్ అనే సినిమాలో హీరోగా నటించినా ఆ సినిమా ఫ్లాప్ అవడంతో హీరోగా అవకాశాలు రాలేదు. ఆ తర్వాత ప్రేమమ్, గువ్వా గోరింక, శమంతకమణి, హవా, సినిమాల్లో సెకండ్ హీరోగా చేశా. ఇటీవల వచ్చిన వకీల్ సాబ్ లో ఒక చిన్న పాత్ర కూడా చేశా. 30 వెడ్స్ 21 వెబ్ సిరీస్ సూపర్ హిట్ కావడంతో చాలామంది ఫోన్ చేసి అభినందిస్తున్నారు. అమ్మాయిల నుంచి ప్రపోజల్స్ వస్తున్నాయి. అయినా హీరోగా సెటిల్ అయిన తర్వాతే పెళ్లి చేసుకుంటా’ అని వెబ్ సీరిస్ స్టార్ చైతన్య తెలిపాడు.

Also Read: బడా బ్యానర్లన్నీ సంతోష్ శోభన్ చుట్టే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -