చరణ్- అర్జున్ తో భారీ మల్టీ స్టారర్.. బడా ప్రొడ్యూసర్ క్లారిటీ !

A Huge Multi-Starrer With Ram Charan and Allu Arjun.
A Huge Multi-Starrer With Ram Charan and Allu Arjun.

టాలీవుడ్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఇద్దరూ మెగా హీరోలే అయినప్పటికి.. క్రేజ్ విషయంలో ఎవరికి ఎవరు తీసిపోరు. ఇక ఇద్దరు హీరోలు కలిసి నటిస్తే చూడాలని మెగా అభిమానులు ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. గతంలో రామ్ చరణ్ నటించిన ” ఎవడు ” మూవీలో అల్లు అర్జున్ గెస్ట్ రోల్ లో మెరిశాడు. ఇక అప్పటినుంచి వీరిద్దరి కలయికలో ఫుల్ లెన్త్ మూవీ కోసం వీరి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే గతంలో కూడా వీరిద్దరి కలయికలో భారీ మల్టీస్టారర్ రాబోతున్నట్లు చాలానే వార్తలు వచ్చాయి. అయితే కార్యరూపం దాల్చలేదు. అయితే వీరిద్దరి కలయికలో మూవీ కచ్చితంగా ఉంటుందని బడా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ క్లారిటీ ఇచ్చారు..

ఇటీవల ఓ టీవి చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఈ భారీ మల్టీ స్టారర్ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు అల్లు అరవింద్. బన్నీ చరణ్ కలయికలో మూవీ కోసం ” చరణ్ అర్జున్ ” అనే టైటిల్ రిజిస్టర్ చేయించినట్లు తెలిపారు. గీత ఆర్ట్స్ బ్యానర్ లో చరణ్, బన్నీ తో కచ్చితంగా భారీ మల్టీ స్టారర్ ఉంటుందని స్పష్టం చేశారు. అయితే ఆ ప్రాజెక్ట్ ఎప్పుడనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు. అయితే ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోలు పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాధించుకున్నారు. పుష్ప మూవీతో అల్లు అర్జున్ క్రేజ్ బాలీవుడ్ లోనూ అమాంతంగా పెరిగింది. ఇక రామ్ చరణ్ కూడా ” ఆర్ ఆర్ ఆర్ ” మూవీ తో అల్ ఇండియా వైజ్ గా అభిమానులను సొంతం చేసుకున్నాడు. దీంతో ప్రస్తుతం వీరిద్దరికి ఉన్న క్రేజ్ ను బట్టి వీరిద్దరితో మల్టీ స్టారర్ అంటే ఇండియన్ బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వడం ఖాయం. మరి వీరిద్దరి స్టార్ డమ్ కు తగిన కథను సిద్దం చేసే డైరెక్టర్ ఎవరో చూడాలి.

ఇవి కూడా చదవండి

మెగా ట్రీట్.. బాస్ వస్తుండు.. గెట్ రెడీ !

మహేశ్ కు విలన్ గా కార్తీ.. రాజమౌళి అదిరిపోయే ప్లాన్ !

NTR30 : గెట్ రెడీ టైటిల్ అనౌన్స్ మెంట్.. ఎప్పుడంటే ?