Saturday, May 4, 2024
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ రిలీజ్ వాయిదా!

- Advertisement -

దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో సినిమా షూటింగ్ లు వాయిదా పడుతున్న విషయం తెలిసిందే. తాజాగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ షూటింగ్ వాయిదా పడింది. గత ఏడాది మొదలు పెట్టినప్పటికీ ఎప్పటికప్పుడు ఈ మూవీకి ఆటంకాలు వస్తూనే ఉన్నాయి.

ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. చరణ్ పాత్రకి సంబంధించిన యాక్షన్ ఎపిసోడ్స్ ను చిత్రీకరించవలసి ఉండగా షూటింగును ఆపేశారు. వాస్తవానికి ఈ మూవీ మే 13న రిలీజ్ చేస్తామని చెప్పారు.. కానీ అనివార్య కారణాల వల్ల పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది.

ప్రస్తుతం కరోనా ఉధృతి కారణంగా సినిమా రిలీజ్ మళ్లీ వాయిదా వేస్తారని గత కొంత కాలంగ వార్తలు వస్తున్నాయి. తాజాగా పరిస్థితులు అనుకూలించాక ఈ సినిమాను విడుదల చేస్తామనీ, రిలీజ్ ఎప్పుడనేది త్వరలో తెలియజేస్తామని నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ నటిస్తుంది. మరో ముఖ్యపాత్రల్లో రామ్ చరణ్, పూజా హెగ్డే నటిస్తున్నారు.

డేవిడ్ వార్నర్ పై నటి ఈషా రెబ్బా ఫన్నీ కామెంట్

కరోనాతో నటి మాలాశ్రీ భర్త కన్నుమూత

చేతి నరాలు కట్ చేసుకొని మాలీవుడ్ నటుడు ఆత్మహత్యాయత్నం!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -