Saturday, April 20, 2024
- Advertisement -

తండ్రైన నటుడు.. వైరల్ ఫోటోలు.. ఎవరంటే?

- Advertisement -

బుల్లితెరపై ప్రసారమైన బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న నటుడు మహత్‌ రాఘవేంద్ర అభిమానులకు ఓ శుభవార్తను తెలియజేశాడు. మహత్‌ భార్య సోమవారం ఓ పండంటి మగ బిడ్డకు జన్మనివ్వడంతో ఈ విషయాన్ని స్వయంగా నటుడు మహత్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.ఈరోజు ఉదయం దేవుడు మాకు పండంటి మగబిడ్డను ప్రసాదించాడు. చిన్నారి రాకతో నేను ప్రాచీ ఆనందంలో మునిగితేలుతున్నాము. మీ అందరి ప్రేమాభిమానాలకు ప్రత్యేక ధన్యవాదాలు. నాన్నగా ఎంతో ఎగ్జైట్ గా ఉన్నాను అంటూ చిన్నారితో కలిసి దిగిన ఫోటోను ట్వీట్ చేశారు.

ఈ విధంగా నటుడు మహత్ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఎంతోమంది అభిమానులను ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే అభిమానులు పెద్ద ఎత్తున మహత్, ప్రాచీన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నటుడు మహత్ తమిళ బిగ్ బాస్ సీజన్ 2 ద్వారా సంపాదించుకున్న సంగతి మనకు తెలిసిందే.

Also read:కేజిఎఫ్ డైరెక్టర్ తో రామ్ చరణ్ సినిమా.. అసలు నిజం?

మహత్ మాజీ మిస్ ఇండియా టైటిల్ విన్నర్ ప్రాచీతో డేటింగ్ లో ఉంటూ 2020 వ సంవత్సరంలో మూడు ముళ్ల బంధం ద్వారా ఒకటైన సంగతి మనకు తెలిసిందే. వివాహం తర్వాత ఫ్యాషన్ రంగంలోకి అడుగుపెట్టిన ప్రాచి ప్రస్తుతం దుబాయ్ లో వ్యాపారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ జంట పండంటి బిడ్డకు జన్మని ఇవ్వడంతో, నటుడు మహత్ ఈ శుభవార్త ను అభిమానులతో షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం మహత్ షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also read:బిగ్ బాస్ ఆఫర్ కొట్టేసిన.. ఆర్ఎక్స్ బామ!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -