ఒక్కటవుతున్న రష్మీ, అనసూయ.. క్రేజి ప్రాజెక్టుకు సై!

- Advertisement -

బుల్లితెరపై తమ అద్భుతమైన ప్రతిభతో స్టార్ యాంకర్స్ గా స్థిరపడిన అనసూయ భరద్వాజ్, రష్మి గౌతమ్ వీరిద్దరూ ఈటీవీలో సక్సెస్ ఫుల్ గా ప్రసారమవుతున్న జబర్దస్త్ షోలలో యాంకరింగ్ చేస్తూనే అడపా దడపా సినిమాల్లో నటిస్తూ వెండితెరపై తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తాజాగా ఈ స్టార్ యాంకర్స్ అనసూయ భరద్వాజ్, రష్మీ గౌతమ్ ఇద్దరూ కలిసి క్రేజీ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.

Also read:అరియానతో ఆర్జీవీ హాట్ వర్కౌట్స్.. వామ్మో!

- Advertisement -

దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే బుల్లితెర హాట్ బ్యూటీస్ అనసూయ, రష్మి ఇద్దరితో కలిసి మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఒక వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నారు. దీనిని ఉమెన్ సెంట్రిక్ వెబ్ సిరీస్ గా తెరకెక్కించబోతున్నట్లు సమాచారం అందుతోంది. ఇప్పటికే యూట్యూబ్ ప్లాట్ ఫాంలో నెంబర్ వన్ స్థానంలో నిలిచిన మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ సంస్థ తాజాగా డిజిటల్ ఎంట్రీ వీరిద్దరి ద్వారా ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ అంశంపై మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నుంచి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.

Also read:నేను ప్రెగ్నెంట్.. ఆయన నన్ని పెళ్లి చేసుకుంటా అన్నాడు: నటి

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -