Friday, May 17, 2024
- Advertisement -

టీఆర్ఎస్‌లో చేర‌డానికి సీనియ‌ర్ హీరో త‌హ‌త‌హ‌

- Advertisement -

క‌రాటేలో రాణిస్తూ సినీ రంగంలో ప్ర‌వేశించి సూప‌ర్ హీరోగా గుర్తింపు పొందిన న‌టుడు సుమ‌న్ త‌ల్వార్‌. హీరోగా మంచి మంచి సినిమాలు తీసిన ఆయ‌న ఆ త‌ర్వాత సినిమాల్లో ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తూ సినీ ప‌రిశ్ర‌మ‌లో బిజీగా ఉన్నాడు. ఆధ్యాత్మిక చిత్రాల్లో దేవుళ్ల పాత్ర‌లో మెర‌వాలంటే ఉన్న న‌టుడు సుమ‌న్ మాత్ర‌మే. ఇప్పుడు అత‌డు సినీ ప‌రిశ్ర‌మ‌లో కొంచెం దూర‌మ‌వుతున్నా.. అప్పుడ‌ప్పుడు సినిమాల్లో క‌నిపిస్తున్నాడు. అయితే సుమన్ మాత్రం సినిమాలు వ‌దిలిపెట్టి రాజ‌కీయాల్లోకి వెళ్లాల‌ని మొద‌టి నుంచి ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నాడు.

జ‌న్మ‌స్థ‌లం క‌ర్నాట‌క‌.. మాతృభాష తులు అయినా హైద‌రాబాద్‌లో స్థిర‌ప‌డ్డారు. తెలుగు, త‌మిళ్‌, మ‌ల‌యాళం, క‌న్న‌డ సినిమాల్లో న‌టించి బాగా గుర్తింపు పొందాడు. క‌రాటే ద్వారా కూడా పేరు ప్ర‌ఖ్యాతులు సంపాదించాడు. తొలి నుంచి సుమన్ రాజ‌కీయాల్లోకి రావాల‌ని ఆస‌క్తి ప్ర‌ద‌ర్శిస్తున్నాడు. గ‌తంలో ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో వెళ్లాల‌ని భావించాడు. త‌ర‌చూ ఎన్టీఆర్‌ను క‌ల‌వ‌డం.. ఆ త‌ర్వాత ఎన్టీఆర్ మ‌ర‌ణం త‌ర్వాత చంద్ర‌బాబు చేతికి టీడీపీ వెళ్ల‌డంతో అప్పుడు కూడా సుమ‌న్ చేరాల‌ని భావించాడు. కొన్నిసార్లు తెలుగుదేశం పార్టీ త‌ర‌ఫున ప్ర‌చారం చేశారు. త‌ర‌చూ చంద్ర‌బాబు, టీడీపీ పాల‌న‌ను మెచ్చుకున్న సుమ‌న్‌కు అవ‌కాశం ఎవ‌రూ ఇవ్వ‌లేదు.

ప్ర‌స్తుతం ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డి టీఆర్ఎస్ అధికారంలోకి వ‌చ్చింది. హైద‌రాబాద్‌లో స్థిర‌ప‌డ‌డంతో ఇప్పుడు తెలంగాణ ప్ర‌భుత్వం పరిపాల‌న‌పై, సీఎం కేసీఆర్‌పై సుమ‌న్ విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపిస్తున్నాడు. త‌ర‌చూ తెలంగాణ ప్ర‌భుత్వం నిర్వ‌హించే అధికారిక‌, అనాధికారిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటూ కేసీఆర్ పాల‌న‌ను కొనియాడుతున్నాడు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ త‌ర‌ఫున ఎమ్మెల్యేగా పోటీ చేయాల‌ని ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నాడు. ఈ కోరిక‌ను స‌మ‌యం చిక్కిన‌ప్పుడ‌ల్లా టీఆర్ఎస్ అధిష్టానం దృష్టికి వెళ్లేలా చూస్తున్నాడు.

ప్ర‌స్తుతం ఆయ‌న న‌టించిన ‘సత్యగాంగ్‌’ సినిమా ప్ర‌చారంలో భాగంగా బుధవారం హైదరాబాద్‌లో విలేకరుల స‌మావేశంలో సుమన్ మాట్లాడారు. సినిమా విషయాల‌తో పాటు త‌న‌కు రాజ‌కీయాలో్ల‌కి వెళ్లాల‌నే ఆస‌క్తి ఉంద‌ని ప్ర‌క‌టించాడు. ‘‘కేసీఆర్‌ సీఎం అయ్యాక తెలంగాణ‌లో చాలా మార్పులు వచ్చాయి. కరెంట్‌ కోత లేకుండా చేశారు. ఇంకా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఒకరోజు ఆయనతో ఐదున్నర గంటలు గడిపే సమయం వచ్చింది. ఆ సమయంలో ఆయన రాత్రింబవళ్లు ప్రజల శ్రేయసు గురించి ఆలోచించడాన్ని గమనించా. ముస్లింలు, దళితులకు ఆయన చక్కటి పదవులివ్వడం ముదావహం. కేసీఆర్‌ రమ్మంటే రాజకీయాల్లోకి వస్తా. టీఆర్‌ఎస్‌ కోసం పనిచేస్తా. కేసీఆర్‌ ఏం చేయమంటే అదే చేస్తాను. సినిమా పరిశ్రమకు మేలు చేయమని నా వంతుగా కోరుతాను. పొరుగు రాష్ట్రాలు కూడా చల్లగా ఉండాలన్న సంకల్పం నాది.

ఈ విధంగా త‌న మ‌న‌సులోని బ‌య‌ట పెట్టారు. మ‌రీ కేసీఆర్ సుమ‌న్ విష‌యంలో ఎలా స్పందిస్తారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -