Saturday, April 27, 2024
- Advertisement -

బీజేపీ మిషన్ 90.. అధికారమే లక్ష్యంగా !

- Advertisement -

వచ్చే ఎన్నికలతో ఎలాగైనా తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజేపీ గట్టి పట్టుదలతో ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో మెల్లమెల్లగా పరిదిని పెంచుకుంటూ బి‌ఆర్‌ఎస్ కు తామే ప్రత్యామ్నాయం అంటూ బీజేపీ నిలుస్తోంది. ప్రస్తుత పరిణామాలను బట్టి చూస్తే తెలంగాణలో బి‌ఆర్‌ఎస్ తరువాతి స్థానం బీజేపీదే అని ఒప్పుకోక తప్పదు. 2018 ఎన్నికల నేపథ్యంలో అట్టడుకులో ఉన్న కాషాయ పార్టీ.. ఈ నాలుగేళ్లలో చపాకింద నీరులా తెలంగాణలో విస్తరించింది. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో అధికార పార్టీకి షాక్ ఇవ్వడంతో పాటు జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికలు మరియు మునుగోడు బైపోల్ లో గెలిచినంత పని చేసింది..

దీన్ని బట్టి చూస్తే తెలంగాణలో కాషాయ పార్టీ ఎంత వేగంగా విస్తరించిందో అర్థం చేసుకోవచ్చు. దీంతో వచ్చే ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ కు చెక్ పెట్టి కమలం వికసింపజేయాలని కమలనాథులు దృఢ సంకల్పంతో ఉన్నారు. అందువల్ల బి‌ఆర్‌ఎస్ ను దెబ్బతీసే ఏ చిన్న ప్రయత్నాన్ని కూడా వదలడం లేదు కమలనాథులు. డిల్లీ లిక్కర్ స్కామ్ తో పాటు, ఇటీవల మళ్ళీ తెరపైకి వచ్చిన బెంగళూరు డ్రగ్స్ కేసు వంటి వాటిని తెరపైకి తెచ్చి అధికార పార్టీకి షాక్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది బీజేపీ.

ఓ వైపు క్షేత్ర స్థాయిలో పార్టీని బలపరచడంతో పాటు మరోవైపు ప్రత్యర్థి పార్టీని బలహీన పరచడంపై దృష్టి కెంద్రీకరించింది. ఇక వచ్చే ఎన్నికల్లో కనీసం 90 స్థానల్లో విజయం సాధించాలంటే టార్గెట్ తో ఉందట బీజేపీ అధిష్టానం. అందుకే మిషన్ 90 ని బలంగా నేతల్లోకి తీసుకెళుతూ నియోజిక వర్గ స్థాయిలో అసెంబ్లీ పాలక్ వ్యవస్థను తీసుకురావాలని బీజేపీ అధిష్టానం చూస్తున్నట్లు తెలుస్తోంది. అందులే ఆయా నియోజిక వర్గాలలో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులపై స్పెషల్ ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఎన్నికలకు ఏడాది మాత్రమే సమయం ఉండడంతో పార్టీ బలోపేతం కోసం అన్నీ విధాలుగా కాషాయ పార్టీ సిద్దమౌతున్నట్లు తెలుస్తోంది. మరి వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న బీజేపీకి తెలంగాణ ప్రజలు ఎలాంటి ఫలితాన్ని ఇస్తారో చూడాలి.

ఇవి కూడా చదవండి

కే‌సి‌ఆర్ జగన్ దోస్తీ.. ఇదే అసలు వ్యూహమా ?

బి‌ఆర్‌ఎస్ వైరస్.. బీజేపీ వ్యాక్సిన్ !

తెలుగువాళ్ళంటే.. ఎందుకంత చిన్న చూపు !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -