Friday, April 26, 2024
- Advertisement -

సూర్య నిర్మాతగా హిందీలో ఆకాశమే హద్దురా రీమేక్..!

- Advertisement -

తమిళంలో సూర్య నటించిన సూరరై పొట్రు ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. సరైన హిట్ లేక సతమతమవుతున్న సూర్యాకు ఈ సినిమా బిగ్ రిలీఫ్ ఇచ్చింది. ఈ సినిమా తెలుగులో ఆకాశమే హద్దురా పేరుతో డబ్బింగ్ అయి ఇక్కడ కూడా ఘన విజయం అందుకుంది. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు కెప్టెన్ గోపీనాథ్ బయోపిక్ గా ఈ సినిమా రూపొందింది.

కరోనా కారణంగా థియేటర్లను మూసివేయడంతో ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. భారీ స్థాయిలో వ్యూస్ సాధించింది. ఈ సినిమా ఇప్పటికే ఉత్తమ చిత్రంగా పలు అవార్డులను కూడా అందుకుంది. తమిళంలో ఈ సినిమాను నిర్మించిన సూర్య, జ్యోతిక దీనిని హిందీలో నిర్మిస్తున్నట్లు ఇవాళ ప్రకటించారు. రాజశేఖర్ పాండియన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అబన్ డంతియ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఈ సినిమా ద్వారా నిర్మాతగా సూర్య హిందీ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు.

తమిళంలో ఈ సినిమాకు దర్శకత్వం వహించిన సుధా కొంగర హిందీ సినిమాకు కూడా దర్శకత్వం వహించనున్నారు.అయితే ఈ సినిమా లో హీరోగా ఎవరు నటిస్తున్నారని విషయమై ఇంకా ప్రకటించలేదు. అతి త్వరలోనే ఈ సినిమాలో నటించే నటీనటుల వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. అయితే ఇటీవల బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ వరుసగా సౌత్ సినిమాలను రీమేక్ చేస్తున్నారు. ఇప్పటికే తెలుగు అర్జున్ రెడ్డి సినిమా తీసి విజయం సాధించిన షాహిద్ కపూర్ ప్రస్తుతం జెర్సీ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఆయనే ఈ సినిమా చేసే అవకాశం ఉందని సమాచారం.

Also Read

సలార్ మూవీలో వాణీ కపూర్..!

మరో తమిళ హీరోతో తెలుగు డైరెక్టర్ సినిమా..!

20 నుంచి అమెజాన్ ప్రైమ్ లో నారప్ప..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -