20 నుంచి అమెజాన్ ప్రైమ్ లో నారప్ప..!

- Advertisement -

తమిళంలో ధనుష్ హీరోగా నటించిన అసురన్ సినిమాను తెలుగులో విక్టరీ వెంకటేష్ నారప్ప పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వెంకీకి జోడీగా ప్రియమణి నటిస్తోంది. కాగా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయి చాలా రోజులు అయింది. సమ్మర్ కానుకగా మే 14వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు సురేష్ బాబు, కలై పులి థాను భావించారు. కరోనా వ్యాప్తి కారణంగా థియేటర్లు మూసివేయడంతో ఈ సినిమా విడుదల ఆగిపోయింది.

అయితే ఆ తర్వాత ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేస్తారని వార్తలు వచ్చాయి. మంచి డీల్ కూడా కుదరడంతో ఈ సినిమా కన్ఫామ్ గా అమెజాన్ లో విడుదల అవుతుందని అంతా అనుకున్నారు. అయితే తెలుగు సినిమాలు వరుసగా ఓటీటీల్లో విడుదల చేయడంపై ఎగ్జిబిటర్లు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఈ సినిమా అమెజాన్ లో విడుదల అవుతుందా లేదా అని సందేహం నెలకొంది.

అయితే తాజాగా అమెజాన్ ప్రైమ్ నారప్ప సినిమాను ఈనెల 20వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో ఈ సినిమా థియేటర్లలో విడుదల అవుతుంది అని వచ్చిన వార్తలు పుకార్లు గా నిలిచి పోయాయి. ఈ సినిమా విడుదలపై విక్టరీ వెంకటేష్ కూడా స్పందించారు. ‘మీ ప్రియమైన వారితో కలిసి ఇంట్లోనే సురక్షితంగా సినిమాను చూసి ఆస్వాదించండి’ అంటూ వెంకటేష్ ట్వీట్ చేశారు.జూలై 20 తేదీ నుంచి మూవీ అమెజాన్ ప్రైమ్ లో వీక్షించవచ్చని ఆయన తెలిపాడు.

Also Read

తమన్ కి తమనే పోటీ..!

బాలయ్య కోసం అనుకున్న టైటిల్ ఎగరేసుకెళ్లాడు..!

ఆర్ఆర్ఆర్ నుంచి అదిరిపోయే అప్డేట్..!

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -