Friday, April 26, 2024
- Advertisement -

మరో తమిళ హీరోతో తెలుగు డైరెక్టర్ సినిమా..!

- Advertisement -

ఇటీవల తెలుగు డైరెక్టర్లు వరుస పెట్టి తమిళ హీరోలతో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే తమిళ హీరో ధనుష్ తెలుగులో రెండు సినిమాలు చేసేందుకు అంగీకరించాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా సినిమా చేసేందుకు అంగీకరించిన ధనుష్, వెంకీ అట్లూరి దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు కూడా అంగీకారం తెలిపాడు. అలాగే తమిళ స్టార్ హీరో విజయ్ దిల్ రాజు నిర్మాతగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు అంగీకారం తెలిపిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు మరో తమిళ హీరో తో తెలుగు డైరెక్టర్ సినిమా చేయనున్నట్లు సమాచారం. జాతి రత్నాలు సినిమాతో తెలుగులో సూపర్ హిట్ అందుకున్న అనుదీప్ తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ తో ఓ సినిమా చేయనున్నారు. ఇటీవల అనుదీప్ శివకార్తికేయన్ ను కలిసి కథ వినిపించగా ఆయనకు నచ్చడంతో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. పిట్టగోడ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన అనుదీప్ తన రెండో సినిమా జాతిరత్నాలు తో హిట్ అందుకున్నాడు. జాతి రత్నాలు సూపర్ హిట్ అయినప్పటికీ ఎందుకు తెలుగులో మరో అవకాశం అతనికి రాలేదు.

జాతిరత్నాలు సినిమాను నిర్మించిన వైజయంతి మూవీస్ అనుదీప్ తో మరో సినిమా చేసేందుకు ముందుకు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. అయితే అది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. అయితే ఆ తర్వాత అనుదీప్ తన వద్ద ఉన్న స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ కథను ఒకరిద్దరు హీరోలకు చెప్పగా అవేవి ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఇటీవల శివకార్తికేయన్ అనుదీప్ కలవడం ఆయనకు చెప్పిన కథ నచ్చడం, ఓకే చెప్పడం జరిగినట్లు సమాచారం. ఈ సినిమాను ఏసియన్ సునీల్ కుమార్ నారంగ్ నిర్మించనున్నట్లు సమాచారం.

Also Read

రజినీ మక్కల్ మండ్రం రద్దు..!

టాలెంటెడ్ రైటర్ తో సుధీర్ బాబు మూవీ..!

ఎన్టీఆర్ మైల్ స్టోన్ మూవీ.. బాలీవుడ్ బడా స్టార్ ను గట్టెక్కిస్తుందా..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -