సలార్ మూవీలో వాణీ కపూర్..!

- Advertisement -

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా మూవీలు చేస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రభాస్ రాధే శ్యామ్ మూవీ ఆల్మోస్ట్ పూర్తి చేశాడు. ప్రస్తుతం ఆది పురుష్, సలార్ సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. సలార్ సినిమాకు కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. హోంభలే ఫిలిమ్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే ఓ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. త్వరలో మరో షెడ్యూలు కూడా ప్రారంభం కానుంది. అయితే తాజాగా చిత్రబృందం ఈ సినిమాలో నటించేందుకు మరో కథానాయికను ఎంపిక చేసినట్లు సమాచారం.

ఇందుకు సంబంధించి ఈ సినిమా మేకర్స్ బాలీవుడ్ బ్యూటీ వాణీ కపూర్ ను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో నటించేందుకు ఆమె కూడా ఒప్పుకున్నారట. అయితే ఇందుకు సంబంధించి అఫీషియల్ ప్రకటన ఇంకా రాలేదు. అతి త్వరలోనే ప్రకటన రానున్నట్లు సమాచారం.

ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న రాధే శ్యామ్ మూవీ ని సెప్టెంబర్లో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఆ తర్వాత ప్రభాస్ సలార్, ఆది పురుష్ సినిమాలను సమాంతరంగా పూర్తి చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత తెలుగు డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం లో పాన్ ఇండియా మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది.

Also Read

‘దృశ్యం’ రిజెక్ట్​ చేసిన రజనీకాంత్​? కారణం ఏమిటంటే?

వకీల్​సాబ్​ టీవీలోకి వచ్చేస్తున్నాడు.. ఎప్పుడంటే?

‘ఉస్తాద్’ గా ముందుకొస్తున్న రామ్..!

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -