Friday, March 29, 2024
- Advertisement -

రజనీ నెక్స్ట్ మూవీ డైరెక్టర్ ఎవరో తెలుసా..?

- Advertisement -

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం సిరుతై శివ దర్శకత్వంలో అన్నాత్తే అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి రజినీ వర్షన్ షూటింగ్ పూర్తయింది. డబ్బింగ్ కూడా పూర్తిచేసారు. ప్రస్తుతం రజనీకాంత్ వైద్య చికిత్సల కోసం కుటుంబంతో కలిసి అమెరికాకు వెళ్లారు. అక్కడ ఆయన మూడు నెలలపాటు ఉండనున్నారు. అక్కడి నుంచి ఆయన తిరిగి రాగానే తన పెద్ద కుమార్తె సౌందర్య దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్లు సమాచారం.

సౌందర్య మొదట్లో గ్రాఫిక్ డిజైనర్ గా పని చేసేది. ఆ తర్వాత దర్శకురాలిగా మారి తన తండ్రి హీరోగా కొచ్చాడయాన్ అనే సినిమాను తెరకెక్కించింది. రూ.125 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఇండియాలో నిర్మితమైన తొలి యానిమేషన్ సినిమా ఇదే. ఈ సినిమాలో రజనీకాంత్ సరసన దీపికా పదుకునే నటించింది. ఈ సినిమాలో రజినీ దీపికా లను యానిమేటెడ్ బొమ్మలుగా చూసేందుకు జనం ఇష్టపడలేదు. దీంతో ఈ సినిమా ఫ్లాప్ గా నిలిచింది.

అయితే రెండేళ్ల విరామం తర్వాత మళ్లీ సౌందర్య తన తండ్రి రజనీతో మరో సినిమా చేయనున్నట్లు టాక్. అన్నాత్తే సినిమా తర్వాత రజనీకాంత్ నటించిన సినిమా ఇదేనని ప్రచారం జరుగుతోంది. మరోవైపు రజనీకాంత్ నటించే చివరి సినిమా అన్నాత్తే నని, ఈ సినిమా తరువాత రజినీకాంత్ సినిమాలకు గుడ్ బై చెప్పనున్నారని కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తన కుమార్తె సౌందర్య దర్శకత్వంలో రజనీ కాంత్ హీరోగా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇందుకు సంబంధించి అఫీషియల్ ప్రకటన రావాల్సివుంది.

Also Read

పవన్​కల్యాణ్​కు బండ్ల గణేశ్​ పెట్టిన పేరు ఇదే..!

పవర్​స్టార్​ ​​- హరీశ్​శంకర్​​ మూవీ సబ్జెక్ట్​ ఇదే?

ఓటీటీలో ఈ వారం వస్తున్న సినిమాలు ఇవే

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -