Friday, May 3, 2024
- Advertisement -

బిగ్ బాస్ కి నో చెప్పిన పవన్ హీరోయిన్!

- Advertisement -

తెలుగు ఇండస్ట్రీలో ఎస్.జె.సూర్య దర్శకత్వంలో పవన్ కళ్యాన్ హీరోగా నటించిన ఖుషి చిత్రంలో హీరోయిన్ గా నటించిన భూమిక తర్వాత స్టార్ హీరోల సరసన నటించింది. చేసిన చిత్రాలు తక్కువే అయినా భూమిక కు మంచి పేరు వచ్చింది. సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఈ అమ్మడు నాని హీరోగా నటించిన ఎంసీఏ చిత్రంలో నటించింది. ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తుంది.

ఇక బాలీవుడ్ బుల్లితెరపై కొన్ని సంవత్సరాలుగా అలరిస్తున్న బిగ్ బాస్ షో ఇప్పుడు 15వ సీజన్ కి సిద్దం అవుతుంది. అయితే బిగ్ బాస్ 15లో ప్ర‌ముఖ తెలుగు హీరోయిన్ భూమిక చావ్లా ఎంట్రీ ఇవ్వబోతుందన్న వార్త‌లు తెర‌పైకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ వార్తలపై స్పందించిన భూమిక నాకు బిగ్ బాస్ నుంచి ఆఫ‌ర్ రాలేదు.

ఒక‌వేళ వ‌చ్చినా నేను చేయ‌నని తేల్చి చెప్పింది. గతంలో సీజ‌న్ 1,2,3 తోపాటు మ‌రోసారి కూడా నాకు ఆఫ‌ర్ వ‌చ్చినా కానీ నేను తిర‌స్క‌రించాను. ప్రస్తుతం అయితే తనకు బిగ్ బాస్ నుంచి ఎలాంటి పిలుపు రాలేదని చెబుతుంది. తాను ఒక సెలబ్రెటీ అని.. బిగ్ బాస్ షోలో ప్రైవేట్ గా నా చుట్టూ 24/7 కెమెరాలుంటాయి. ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రోగ్రామ్ లో తాను ఇమడలేనని చెబుతుంది. ప్ర‌స్తుతం తెలుగులో ఇదే మా క‌థ‌, పాగ‌ల్, హిందీలో మిష‌న్ మ‌జ్ను చిత్రాల్లో నటిస్తోంది.

మిస్ట‌ర్ బీన్ చనిపోయాడంటూ అసత్య ప్రచారం!

రూమర్లకు ఒక్క ప్రోమోతో చెక్ పెట్టిన.. ఎవరు మీలో కోటీశ్వరుడు?

మళ్లీ పెళ్లికి సిద్ధమైన బిగ్ బాస్ నోయల్..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -