Thursday, May 2, 2024
- Advertisement -

కల్నల్ సంతోష్ బాబు విగ్రహాన్ని ఆవిష్కణ

- Advertisement -

భారత్‌-చైనా సరిహద్దులో డ్యూటీ చేస్తు భారతదేశం కోసం చైనా సైనికులతో వీరోచితంగా పోరాడి అమ‌రుడైన‌ కర్నల్‌ సంతోష్‌ బాబు విగ్ర‌హాన్ని సూర్యాపేట‌లోని కోర్టు చౌరస్తాలో కల్నల్ సంతోష్ బాబు 9 అడుగుల‌ కాంస్య విగ్రహాన్ని మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా ఆవిష్క‌రించారు. భారత్- చైనా సరిహద్దుల్లోని లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంట 2020 జూన్‌ 15న చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో సూర్యాపేటకు చెందిన సంతోష్‌బాబు వీరమరణం పొందాడు.

సంతోష్ బాబుతో పాటు మ‌రికొంద‌రు భారత సైనికులు అమరులైన విషయం తెలిసిందే. తెలంగాణ ముద్దు బిడ్డ సంతోష్ బాబు మరణం అనంతరం ఆయన కుటుంబాన్ని సీఎం కేసీఆర్ స్వయంగా పరామర్శించారు. తెలంగాణ ప్రజలకే కాదు యావత్ భారతదేశానికి ఎప్పటికీ గుర్తుండిపోతుంది అన్న సీఎం కేసీఆర్ అన్నారు. ఈ సందర్భంగా కర్నల్‌ సంతోష్‌బాబు కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం 5 కోట్ల రూపాయాల ఆర్థిక సహాయాన్ని అందించారు.

అనంతరం సంతోష్‌బాబు భార్యకు ప్రభుత్వ ఉద్యోగం, ఇంటి స్థలాన్ని సైతం అందించారు. కాగా, దేశం కోసం ప్రాణాలు అర్పించిన సంతోబాబు వీరోచిత పోరాట స్ఫూర్తి ఎప్పటికీ గుర్తుండిపోయే విధంగా సూర్యాపేటలో ఆయన కాంస్య విగ్రహాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

ఎన్టీఆర్ ని ఢీ కొట్టనున్న విజయ్ సేతుపతి!

టక్​ జగదీశ్​ విడుదలకు అడ్డంకులు తొలగినట్టేనా?

తమిళనాడు సీఎం రిలీఫ్ ఫండ్‌కు నటుడు విజయ్ సేతుపతి రూ. 25లక్షలు సాహాయం…

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -