Friday, March 29, 2024
- Advertisement -

డెలివరీకి ముందు కరోనా.. ఒక్క దానినే వెళ్లి ఎన్నో అవస్థలు అంటూ భావోద్వేగానికి గురైన హరితేజ!

- Advertisement -

బుల్లితెరపై పలు కార్యక్రమాలలో యాంకర్ గా సందడి చేస్తూ,పలు సీరియల్స్ లో ఎంతో అద్భుతంగా నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న హరితేజ అందరికీ పరిచయమే. గత కొద్ది రోజుల క్రితం హరితేజ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి మనకు తెలిసిందే. తన బిడ్డ పుట్టిన తర్వాత బిడ్డకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హరితేజ గత కొంత కాలం నుంచి సోషల్ మీడియాకు దూరంగా ఉన్నారు.

తాజాగా చాలా రోజుల తర్వాత ఒక వీడియో ద్వారా అభిమానులను పలకరించారు.ఇన్ని రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉండడానికి గల కారణాలను కూడా ఆమె ఈ వీడియో ద్వారా వివరించారు. డెలివరీకి ఒక వారం ముందు రోజులు తన కరోనా బారిన పడ్డానని, అదే సమయంలో ఇంట్లో వాళ్లకు కూడా పాజిటివ్ రావడంతో డెలివరీ సమయంలో ఎన్నో ఇబ్బందులు పడ్డానని ఆమె తెలిపారు.కుటుంబ సభ్యులందరికీ పాజిటివ్ రావడంతో డెలివరీ ఒక్కదాన్నే వెళ్లి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని ఈ వీడియో ద్వారా హరితేజ వివరించారు.

Also read:మెగా హీరో రామ్ చరణ్ వదులుకున్న హిట్ సినిమాలు ఏంటో తెలుసా?

నేను పడిన ఇబ్బంది ఏ ఒక్కరు పడకుండా ఉండటం కోసం ఈ వీడియో ద్వారా మరికొందరు అయిన జాగ్రత్తలు తీసుకుంటారనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నట్లు ఆమె తెలిపారు. రెగ్యులర్ చెకప్ చేసే డాక్టర్ తనకు కరోనా ఉండటంవల్ల డెలివరీ చేయనని చెప్పడంతో కోవిడ్‌ ఆస్పత్రులను సంప్రదించా. నాకు పాజిటివ్‌ కాబట్టి బేబీకి కూడా వస్తుందని భయపడ్డాను. అన్ని రకాల టెస్టులు చేయించుకున్నాను. రిపోర్టుల కోసం రాత్రులు ఎదురు చూస్తూ ఎంతో ఇబ్బంది పడ్డానని తెలిపారు.

కోవిడ్ వార్డులో ఒక్కదాన్నే ఉన్నాను పాప పుట్టగానే నానుంచి తీసుకెళ్లారు. పాపను కూడా వీడియో కాల్ లో చూడాల్సి వచ్చిందంటూ హరితేజ భావోద్వేగం అయ్యారు. పాప పుట్టిందని తెలియగానే ఎంతోమంది విషెస్ చేశారు వారందరికీ ఈ వీడియో ద్వారా హరితేజ కృతజ్ఞతలు తెలిపారు.

Also read:టాలీవుడ్ 100 కోట్ల సినిమా.. అక్కడ మాత్రం అట్టర్ ప్లాప్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -