Tuesday, April 30, 2024
- Advertisement -

వ్యాపారవేత్తతో అనుష్క పెళ్లి.. తనకంటే చిన్నవాడితో పట్టుపడడంతోనే?

- Advertisement -

టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరోయిన్ అంటే అందరికీ వెంటనే అనుష్క శెట్టి గుర్తొస్తారు.తెలుగులో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించిన అనుష్క ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడు అనుష్క పెళ్లి వార్తలు వస్తూనే ఉంటాయి. అయితే సినిమా ఇండస్ట్రీలో అనుష్క, ప్రభాస్ జంటకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

తెరపై ఎన్నో సినిమాలలో జతకట్టిన ఈ జంట నిజ జీవితంలో కూడా ఒకటైతే చూడాలని ఎంతో మంది ప్రభాస్, అనుష్క అభిమానుల కోరిక కూడా. ఈ నేపథ్యంలోనే గతంలో వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఈ విషయంపై స్పందించిన ఈ జోడీ తాము మంచి స్నేహితులమని చెప్పడంతో అప్పటి నుంచి వీరిద్దరూ చేసుకోబోయే పర్సన్స్ ఎవరో అని ఆతృతగా ఎదురు చూశారు.

Also read: జీవితంలో గెలవాలంటే ఈ రెండు సూత్రాలు పాటించాలి.. సమంత!

తాజాగా అనుష్క పెళ్లికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ప్రస్తుతం ఎటువంటి సినిమాలు లేక ఇంట్లో ఎక్కువ సమయం గడుపుతున్నా అనుష్క పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైందని తెలుస్తోంది. దీంతో దుబాయ్ కి చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్త కొడుకుతో తన వివాహం నిశ్చయమైనట్లు, తెలుస్తోంది. అదేవిధంగా ఆ వరుడు అనుష్క కన్నా వయసులో చిన్నవాడని, అన్ని సవ్యంగా కుదిరితే మరికొద్ది రోజుల్లోనే జేజమ్మ పెళ్లిపీటలు ఎక్కబోతోందని సమాచారం. అయితే ఈ విషయంలో క్లారిటీ రావాలంటే అనుష్క స్పందించే వరకు వేచి చూడాల్సిందే.

Also read:టాలీవుడ్ 100 కోట్ల సినిమా.. అక్కడ మాత్రం అట్టర్ ప్లాప్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -