Thursday, April 25, 2024
- Advertisement -

తొడకొట్టి డ్యాన్స్ చేసిన బుల్లితెర మెగాస్టార్ కూతురు.. వైరల్ వీడియో!

- Advertisement -

ఇండస్ట్రీలో ఎంతో మంది సీనియర్ నటులు ఒక ప్రత్యేక గుర్తింపు తో ఇప్పటికీ నటిస్తూనే ఉన్నారు. అంతేకాకుండా వాళ్ళ నటనలో ఎంతోమంది అభిమానుల హృదయాలను గెలుచుకుని.. మొత్తానికి ఓ స్టార్ డమ్ మోస్తున్నారు. అలా వెండితెరపై కాకుండా బుల్లితెరపై కూడా ఎంతమంది స్టార్ నటులు ఉన్నారు. అందులో ఒకరు ప్రభాకర్. ఈయన ఎన్నో డైలీ సీరియల్ లో నటించి మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు.

అంతేకాకుండా బుల్లితెరలో మెగా స్టార్ నటుడిగా పేరు సంపాదించుకున్నాడు. ఈయన మొదట యాహూ షో తో పరిచయమయ్యి.. ఆ తర్వాత ఈటీవీ సుమన్ తో ఎంతో స్నేహాన్ని పెంచుకున్నాడు. ఈటీవీ లో కూడా పలు సీరియళ్లలో నటించాడు ప్రభాకర్. ఇక ఈయన వెండితెరపై కొన్ని సినిమాలలో కూడా నటించిన సంగతి తెలిసిందే. ఇక గతంలో కొన్ని రోజులు తన వ్యక్తిగత కారణాల వల్ల బుల్లితెరకు దూరమవ్వగా..మళ్ళీ ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారం అవుతున్న లో హీరోగా నటిస్తున్నాడు.

ఇక ఈయన రెండు సినిమాలలో దర్శకత్వం వహించగా.. నిర్మాతగా కూడా బాధ్యతలు తీసుకున్నారు. అంతేకాకుండా బుల్లితెరలో అత్యధిక పారితోషికాన్ని అందుకున్న నటులలో ఈయన మొదటి స్థానంలో ఉన్నాడు. ఇదిలా ఉంటే ప్రభాకర్ గతంలో తన కుటుంబాన్ని ఎక్కువగా పరిచయం చేయలేదు కానీ.. ఈ మధ్య కొన్ని తన కుటుంబ సభ్యులను పరిచయం చేశాడు. అంతే కాకుండా తన భార్యతో కలిసి ఓంకార్ ప్రోగ్రాం లో కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే.

Also read:రెండో సినిమాతో హిట్ కొట్టిన దర్శకులు వీళ్ళే!

ఇదిలా ఉంటే ప్రభాకర్ కు ఒక కూతురు ఉంది. తను కూడా కొన్ని సీరియల్ లో నటించింది. ఇక తాజాగా ఈ కుటుంబం మదర్స్ డే సందర్భంగా జీ తెలుగులో ప్రసారం అవుతున్న స్పెషల్ ఈవెంట్ మాతృదేవోభవ షో లో పాల్గొన్నారు. తాజాగా ఈ షో ఎపిసోడ్ ప్రోమో విడుదల కాగా.. అందులో ప్రభాకర్ తన కుటుంబ సభ్యులతో కలిసి హీరో వెంకటేష్ పాటకు స్టెప్పులేశారు. ఇక ప్రభాకర్ కూతురు తన తల్లిదండ్రులతో డాన్స్ చేస్తూ ఆకట్టుకోగా.. అందులో అందరి ముందు తొడకొట్టి ఆకట్టుకుంది. ఇక ఈ షో మే 9 న ప్రసారం కానుంది.

Also read:మందుబాబుల్లో అది చూస్తే ఉందంటున్న యాంకర్ రవి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -