రెండో సినిమాతో హిట్ కొట్టిన దర్శకులు వీళ్ళే!

- Advertisement -

సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా అవకాశం రావాలంటే ఎంతో కష్టపడాలి. సినిమా నిర్మించే నిర్మాతలు హీరో, చిత్ర బృందం మొత్తం కేవలం దర్శకుడి నమ్మి సినిమాలు తీస్తూ ఉంటారు.ఈ క్రమంలోనే దర్శకులు కూడా మొదటి సినిమా విజయవంతం అయితేనే వారికి ఇండస్ట్రీలో మరిన్ని అవకాశాలు వస్తాయి. లేదంటే ఆ దర్శకుడిని పలకరించే వారు కూడా ఉండరు. అయితే మన టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది దర్శకులు మొదటి సినిమా హిట్ కాకపోయినా రెండవ సినిమా ద్వారా మంచి విజయాలను అందుకున్నారు. మరి రెండవ సినిమాతో హిట్ కొట్టిన దర్శకులు ఎవరో తెలుసుకుందాం..

  • వంశీ పైడిపల్లి :మొదటి సినిమా మున్నా,ఈ సినిమా పెద్దగా కలిసి రాకపోయినా రెండవ సినిమా బృందావనం మాత్రం బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది.
  • హరీష్ శంకర్: రవితేజ హీరోగా షాక్ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమైన హరీష్ శంకర్ తన మొదటి సినిమా అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. కొద్ది రోజుల విరామం తర్వాత రవితేజ హీరోగా మిరపకాయ్ ద్వారా తన రుచి చూపించాడు.
  • Also read:ఇంత వయసు వచ్చినా రష్మి గౌతమ్ పెళ్లి ఎందుకు చేసుకోలేదో తెలుసా?
  • వేణు శ్రీరామ్: మొదటి సినిమా ఓ మై ఫ్రెండ్ పర్వాలేదు అనిపించుకున్న రెండవ సినిమా నానితో  ‘ఎం.సి.ఎ’ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.
  • నాగ్అశ్విన్: నాగ్ అశ్విన్ దర్శకుడిగా ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాను తెరకెక్కించారు.ఈ సినిమా ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవడంతో రెండో సినిమా మహానటి ద్వారా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు.
  • Also read:డేర్ చేస్తున్న ఎన్టీఆర్.. కరోనా అంటే భయం లేదా?
  • శీను వైట్ల: రవితేజ హీరోగా నీకోసం సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ కావడంతో ఆనందం సినిమా ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.
  • విక్రమ్ కుమార్: ఇష్టం సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమైన విక్రమ్, నితిన్ ఇష్క్ సినిమా ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.
- Advertisement -

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -