Sunday, May 4, 2025
- Advertisement -

ఎప్పటినుంచో ఆ కోరిక ఉండేదంటున్న నటి ప్రగతి..!

- Advertisement -

తెలుగు సినిమాలలో సహాయ పాత్రలో మెప్పించి తనకంటూ క్రేజ్ అందుకున్న నటి ప్రగతి. తల్లి, అత్త, అతిథి వంటి పలు పాత్రలలో నటించి తన నటనతో గుర్తింపు అందుకుంది. ఏమైంది ఈ వేళ సినిమాలో హీరో తల్లి పాత్రలలో బాగా మెప్పించి ఉత్తమ నటి అవార్డు కూడా అందుకుంది. తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ భాషలో కూడా నటించింది. ఇక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది ప్రగతి.

ఈ మధ్య తన సోషల్ మీడియా ఖాతాలో ఎప్పటికప్పుడు వీడియోలను, ఫోటోలను బాగా షేర్ చేస్తుంది. అంతేకాకుండా ప్రగతికి విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా ఉంది. ఇదిలా ఉంటే ఒకప్పటి ప్రగతికి ఇప్పటి ప్రగతికి చాలా తేడా ఉంది. ప్రస్తుతం తెగ వర్కౌట్లు చేస్తూ యంగ్ హీరోయిన్ ల తయారయింది. నాలుగు పదుల వయసు లో కూడా మంచి ఫిట్ నెస్ కోసం బాగా దృష్టి పెట్టింది ప్రగతి. ఇదిలా ఉంటే తనకు ఎప్పటి నుంచో ఓ కోరిక ఉండేదట.

Also read:లక్కీ ఛాన్స్ కొట్టేసిన..ఫరియా అబ్దుల్లా!

ఇదిలా ఉంటే తాజాగా సోషల్ మీడియా వేదికగా తన ఫాలోవర్స్ తో కాసేపు ముచ్చటించింది. ఇక వాళ్లు అడిగిన ప్రశ్నలకు వెంటనే స్పందించింది. ఇదిలా ఉంటే ఓ నెటిజన్ ప్రగతి ని ఓ ప్రశ్న అడిగాడు. ఇంతలా వర్కౌట్ చేయడానికి ఎవరి ఇన్స్పిరేషన్ అని అడిగాడు. దీంతో వెంటనే స్పందించిన ప్రగతి తనకు ఎప్పటినుంచో ఫిట్ గా ఉండాలనే కోరిక ఉండేదని, గత రెండేళ్ల నుంచి తెగ వర్కవుట్లు చేస్తున్నానని తెలిపింది. అంతేకాకుండా తనకు ఒక్కసారి రిజల్ట్ వచ్చాక ఇంకా చేయాలని అనిపించిందని తెలిపింది. దాంతో తన ఎనర్జీ, ఫిట్ నెస్ కూడా బాగా పెరిగిపోయిందని తెలిపింది ప్రగతి.

Also read:10 మంది బాలీవుడ్ సెలబ్రెటీలతో ప్రభాస్ సినిమా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -