10 మంది బాలీవుడ్ సెలబ్రెటీలతో ప్రభాస్ సినిమా?

- Advertisement -

టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మాస్, క్లాస్ ఆడియన్స్ లో యమ క్రేజ్ ఉన్న కథానాయకుడు. టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ బాహుబలి తర్వాత పాన్ ఇండియా లెవెల్ లో అదరగొడుతు పలు క్రేజీ, భారీ బడ్జెట్ సినిమాల్లో నటిస్తూ తన దూకుడును ప్రదర్శిస్తున్నాడు. ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన “రాధేశ్యామ్ “మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో “సలార్‌”మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అలాగే డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో “ఆది పురుష్” వంటి భారీ బడ్జెట్ సినిమాల్లో నటిస్తున్నాడు.

అయితే ఈ మూడు సినిమాల తర్వాత ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ మూవీని వైజయంతి మూవీస్ సంస్థ దాదాపు ఐదు వందల కోట్లు భారీ బడ్జెట్ తో నిర్మించేందుకు సిద్ధమైంది. ఈ మూవీలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనెను సెలెక్ట్ చేయగా, మరో బాలీవుడ్ నటుడు బిగ్ బి అమితాబచ్చన్ కీలక పాత్రలో నటించనున్నారన్న విషయం ఇప్పటికే దర్శకుడు నాగ్ అశ్విన్ అధికారికంగా ప్రకటించాడు.

- Advertisement -

Also read:బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టబోతున్న సత్యదేవ్!

తాజాగా మూవీకి సంబంధించిన ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.ఈ మూవీలో అమితాబ్ బచ్చన్,దీపికాతో పాటు మరికొందరు బాలీవుడ్ నటులు నటిస్తున్నారన్న విషయం ప్రస్తుతం వైరల్ గా మారింది. సినిమాలో ప్రతినాయకుని పాత్రలో ప్రముఖ బాలీవుడ్‌ నటుడిని సంప్రదించినట్లు తెలుస్తోంది. అలాగేఇతర ముఖ్య పాత్రల కోసం బాలీవుడ్ నుంచి మరో ఏడుగురు పముఖ న‌టీన‌టుల‌ను తీసుకోవాల‌నే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి పదిమంది బాలీవుడ్ ప్రముఖులతో ప్రభాస్ హీరోగా సినిమా ఫిక్స్ చేయబోతున్నాడు దర్శకుడు నాగ అశ్విన్.

Also read:మా అమ్మ ఎదురుగానే ఆ నిర్మాత ఎంతో అసభ్యంగా మాట్లాడాడు:కిష్వర్ మర్చంట్

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -